సడన్‌ బ్రేక్‌తో తంటా | Sakshi
Sakshi News home page

సడన్‌ బ్రేక్‌తో తంటా

Published Tue, Dec 19 2023 12:46 AM

ప్రమాదంలో దెబ్బతిన్న కార్లు   - Sakshi

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులో వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 కార్లు ధ్వంసమైన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విమానాశ్రయం రోడ్డులోని సాదళ్లి గేట్‌ వద్ద ముందు వెళ్తున్న ఒక కారు సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కార్లు వరుసగా ఒకటికొకటి ఢీకొన్నాయి. దీంతో 9 కార్లు ధ్వంసమయ్యాయి. కొందరికి చిన్న చిన్న గాయాలు తప్ప అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. అత్యవసర పనుల మీద వెళ్తున్న ప్రయాణికులు లబోదిబోమన్నారు. ప్రమాదం కారణంగా కాసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. చిక్కజాల పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి ట్రాఫిక్‌ను సరిదిద్దారు.

9 కార్లు వరుసగా ఢీ

1/1

Advertisement
Advertisement