21న సీఎం జగన్‌ పుట్టిన రోజు | Sakshi
Sakshi News home page

21న సీఎం జగన్‌ పుట్టిన రోజు

Published Tue, Dec 19 2023 12:46 AM

పోస్టర్‌ను విడుదల చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబ సభ్యులు   - Sakshi

బనశంకరి: సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని బెంగళూరు–మారతహళ్లి వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 21న మారతహళ్లి వర్తూరు రోడ్డు, కుందనహళ్లిగేట్‌ కరుణాశ్రయ క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఉదయం 7.30 గంటలకు కేక్‌ కటింగ్‌, స్వీట్లు, పండ్ల పంపిణీ చేస్తామని వైఎస్‌ఆర్‌ సీపీ కుటుంబం తెలిపింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబ సభ్యులు, మిత్రులు కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో లయన్‌ భాస్కర్‌రెడ్డి అంబవరం (ఏపీసీఓఎస్‌ స్టేట్‌ డైరెక్టర్‌) వైఎస్‌ఆర్‌పీసీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పలు సేవా కార్యక్రమాల నిర్వహణ

Advertisement
Advertisement