ఫిబ్రవరి 29న బనశంకరీ సన్నిధిలో సామూహిక వివాహాలు | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 29న బనశంకరీ సన్నిధిలో సామూహిక వివాహాలు

Published Tue, Dec 19 2023 12:46 AM

వివరాలు వెల్లడిస్తున్న ఏహెచ్‌.బసవరాజ్‌ తదితరులు - Sakshi

బనశంకరి: బనశంకరి సామూహిక వివాహ వేదిక ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 29న సామూహిక వివాహాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివాహ వేదిక వ్యవస్థాపకుడు, బీబీఎంపీ మాజీ విపక్షనేత ఏహెచ్‌.బసవరాజ్‌ వివరాలు వెల్లడించారు. గత 24 ఏళ్లుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు తమ వేదిక ద్వారా 1431కి పైగా జంటలకు ఉచిత వివాహాలు జరిపించామని, నేటి రోజుల్లో పెళ్లి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, పేదలు భరించలేరన్నారు. దీంతో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024 ఫిబ్రవరి 29 తేదీ ఉదయం 11.12 నిమిషాల వృషభ లగ్నంలో సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బెంగళూరు, బెంగళూరు గ్రామాంతర, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే వారు సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకోవచ్చన్నారు. వివాహం చేసుకోబోయే వధూవరులు, తల్లిదండ్రులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి, హిందూ సాంప్రదాయం ప్రకారం దుస్తులు, బాసింగం, కంకణధార, పూలహారం, మాంగళ్యం, కాలి మెట్టెలు, తలపేటె భోజన వ్యవస్థ కల్పిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో వేదిక పదాధికారులు దామోదర్‌నాయుడు, హెచ్‌కే.ముత్తప్ప, ఆర్‌.నారాయణస్వామి, సీ.ముత్తప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement