ఘరానా తహసీల్దార్‌! | Sakshi
Sakshi News home page

ఘరానా తహసీల్దార్‌!

Published Mon, Feb 12 2024 1:16 AM

-

మండ్య: చనిపోయిన వ్యక్తి పేరుతో ఆధార్‌ కార్డును సృష్టించి అతని పేరుతో ప్రభుత్వ భూమిని మరొకరికి విక్రయించి, దానికి ఖాతా కూడా చేశారు. ఈ కేసులో మండ్య తాలూకాలో గతంలో పనిచేసిన తహసీల్దార్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా బెంగళూరులో ప్రముఖ నేతలు కాపాడుతున్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఆ తహసీల్దార్‌తో పాటు మొత్తం 8 మంది పైన చట్టపైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త కే.ఆర్‌. రవీంద్ర మండ్య కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు 2022 అక్టోబరులో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి 2023 మేలో కలెక్టర్‌కు నివేదికను ఇచ్చారు. ఆ తహసీల్దార్‌ తప్పు చేశాడని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌.. అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. కానీ సదరు తహసీల్దార్‌ బెంగళూరులో కొందరు ప్రముఖ నాయకుల అండతో చర్యలు తీసుకోకుండా చేసుకోవడం గమనార్హం.

Advertisement
Advertisement