రంగులు చల్లి, చిందులు వేసి | Sakshi
Sakshi News home page

రంగులు చల్లి, చిందులు వేసి

Published Wed, Mar 27 2024 12:50 AM

రాయల నగరిలో హోలి సంబరాల్లో స్థానికులు, విదేశీయులు  
 - Sakshi

హొసపేటె: రాయల రాజధాని హంపీలో రంగుల పండుగ హోలీ సంభ్రమం అంబరాన్నంటింది. దేశ విదేశీ యాత్రికులు రంగులు చల్లుకుని చిందులేస్తూ మైమరచిపోయారు. హోలీ పౌర్ణమి సందర్భంగా రథ వీధిలో సోమవారం అర్ధరాత్రి కాముని దహనం నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి విరుపాక్ష దేవాలయం ముందు రథ వీధిలో స్థానికులతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన వేలాది పర్యాటకులు హంపీలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. రంగులల పొడులు, రంగు నీళ్లను బాటిళ్లలో నింపుకొని చల్లుకున్నారు. హ్యాపీ హోలీ అంటూ నినాదాలు చేశారు. డప్పులు, చప్పట్లు మోతతో నృత్యాలు చేశారు. విదేశీ వనితలు, వారి సహచరులు ఉత్సాహం పట్టలేక చిందులేశారు. తరువాత తుంగభద్ర నదిలో జలకాలాడి రంగులను శుభ్రం చేసుకున్నారు.

రాష్ట్రమంతటా వేడుకలు

మరోవైపు రాష్ట్రమంతటా రెండవ రోజు కూడా హోలీ ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. దావణగెరె, కలబురిగి, బాగల్‌కోట తదితర ప్రాంతాల్లో వీధుల్లో సామూహికంగా రంగులు చల్లుకుని హల్‌చల్‌ చేశారు. ధార్వాడ సప్తపూర్‌లో వేలాదిమంది గుమిగూడి హోలీని ఆచరించారు. బెంగళూరులో నీటి కొరత వల్ల రంగు పొడులు మాత్రం చల్లుకున్నారు.

హంపీలో విదేశీయుల హోలీ ఉత్సాహం

 కలబురిగిలో డోళ్లు వాయిస్తున్న మహిళలు
1/6

కలబురిగిలో డోళ్లు వాయిస్తున్న మహిళలు

మంగళవారం హంపీలో హోలీ వేడుకల్లో విదేశీ వనిత
2/6

మంగళవారం హంపీలో హోలీ వేడుకల్లో విదేశీ వనిత

బెంగళూరులో ప్యాలెస్‌ మైదానంలో అతివల హంగామా
3/6

బెంగళూరులో ప్యాలెస్‌ మైదానంలో అతివల హంగామా

హంపీలో చిన్నారితో కలిసి యువతి హోలీ
4/6

హంపీలో చిన్నారితో కలిసి యువతి హోలీ

 ధార్వాడ సప్తపూర్‌లో హోలీ రచ్చ, బాలికల చిందులు
5/6

ధార్వాడ సప్తపూర్‌లో హోలీ రచ్చ, బాలికల చిందులు

6/6

Advertisement
Advertisement