ఇతర రాష్ట్రాల సంస్థలకు బుకింగ్‌ | Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాల సంస్థలకు బుకింగ్‌

Published Mon, Apr 8 2024 12:45 AM

-

హెలికాప్టర్లను ఎక్కడైనా సులభంగా ల్యాండ్‌ చేయవచ్చు. విమానాలకు విమానాశ్రయం తప్పనిసరి. బళ్లారి, బెళగావి, హుబ్లీ, బీదర్‌, కలబుర్గి, బెంగళూరులోనే విమానాశ్రయాలు ఉన్నాయి. ఉత్తర కర్ణాటక పరిధిలో బళ్లారి, బీదర్‌, కలబుర్గి, హుబ్లీ విమానాశ్రయాల్లో అగ్రనేతలు ల్యాండ్‌ అవుతూ సభాస్థలికి హెలికాప్టర్లు, లేదా కారులో వెళుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 26, మే 7న రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. అన్ని పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లు విస్తృతంగా తిరిగేందుకు మూడు నెలలు ముందే హెలికాప్టర్లను బుక్‌ చేసుకున్నారు. రాష్ట్రంలో హెలికాప్టర్లు, మినీ విమానాల సంఖ్య నేతల డిమాండుకు తగినంతగా లేదు, దీంతో హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌, గోవా, జైపూర్‌,మహారాష్ట్ర ఢిల్లీ, కోల్‌కతాలలోని విమానాయాన సంస్థలకు కూడా బుకింగ్‌లు ఇచ్చారు. పలువురు బడా నేతలు సొంత చార్డెడ్‌ విమానాలను వాడుతున్నారు. కొందరు పారిశ్రామికవేత్తలు తమ హెలికాప్టర్లు, చిన్న విమానాలకు పార్టీలకు సాయంగా ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతో ఆకాశయానానికి మరింత గిరాకీ ఏర్పడనుంది.

Advertisement
Advertisement