బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

16 May, 2021 12:05 IST|Sakshi

బెంగళూరు: కర్నాటక బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది . ఐదంతస్తుల కోల్డ్ స్టోరేజ్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి . దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు . సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు . కానీ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేదు . ఈ ప్రమాదంలో మూడంతస్తుల్లో ఉన్న మిరప నిల్వలు పూర్తిగా దగ్ధం అయ్యాయి .
(చదవండి: వైరల్‌: క్వారంటైన్‌లో ఎమ్మెల్యే చిందులు)

Read latest Karnataka News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు