కల్యాణం, తెప్పోత్సవానికి రూ.21 లక్షలు | Sakshi
Sakshi News home page

కల్యాణం, తెప్పోత్సవానికి రూ.21 లక్షలు

Published Tue, Mar 28 2023 12:16 AM

మాట్లాడుతున్న కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, 
పక్కన సుడా చైర్మన్‌ విజయ్‌, మేయర్‌ నీరజ  - Sakshi

ఖమ్మంఅర్బన్‌/ఖమ్మం మయూరిసెంటర్‌: ఖమ్మం ఇందిరానగర్‌లోని పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో రాములోరి కల్యాణోత్సవం, తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా కేఎంసీ నుంచి రూ.21లక్షలు కేటాయించినట్లు కమిషనర్‌ ఆదర్శసురభి, మేయర్‌ పునుకొల్లు నీరజ తెలిపారు. కేఎంసీతో పాటు ఆలయం వద్ద సోమవారం వేర్వేరుగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో వారు మాట్లాడారు. కల్యాణోత్సవానికి 25వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈనెల 30న ఉదయం కల్యాణం జరగనుండగా, సాయంత్రం 5గంటలకు ఆలయం నుంచి శోభాయాత్రగా లకారం ట్యాంక్‌బండ్‌కు చేరుకుని తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. వేలాది మంది భక్తులతో శోభాయాత్ర సాగుతుందని, తెప్పోత్సవ వేదిక వద్ద భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సుడా చైర్మన్‌ విజయ్‌, రామాలయం ఈఓ కాముని శ్రీకాంత్‌, ప్రధానార్చకులు శేషభట్టార్‌ పవన్‌కుమారాచార్యులుతో పాటు చావా నారాయణరావు, రావూరి సైదుబాబు, కొత్తా రవి, పల్లెబోయిన రవి,సత్యం, స్వర్ణ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement