‘స్పాట్‌’ వ్యాల్యూయేషన్‌ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు.. | Sakshi
Sakshi News home page

‘స్పాట్‌’ వ్యాల్యూయేషన్‌ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..

Published Mon, Apr 17 2023 12:38 AM

- - Sakshi

ఖమ్మం: పదో తరగతి స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు కోరారు. ఆదివారం స్పాట్‌ కేంద్రంలో డీఈఓ సోమశేఖర శర్మకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. స్పాట్‌ కేంద్రం సమీపంలో మిర్చి మార్కెట్‌ యార్డు ఉండడం వల్ల మూల్యాంకనం సమయంలో ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. కేంద్రంలో తాగునీరు అందించడంతో పాటు అవసరమైన వారికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని కోరారు.

అనారోగ్య కారణాలతో స్పాట్‌కు హాజరు కాలేని ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. గతేడాది స్పాట్‌ విధులు నిర్వహించిన గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తక్షణమే రెమ్యూనరేషన్‌ చెల్లించాలని కోరారు. కాగా, స్పాట్‌ సెంటర్‌లో ఇబ్బందులను గుర్తించిన డీఈఓ కేంద్రం మార్పునకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు యాదగిరి, షేక్‌ మన్సూర్‌, నాయకులు వెంకన్న, సుధాకర్‌రెడ్డి, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement