ధాన్యం నగదు చెల్లించాలని ఆందోళన | Sakshi
Sakshi News home page

ధాన్యం నగదు చెల్లించాలని ఆందోళన

Published Wed, May 31 2023 12:16 AM

తల్లాడ సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు   - Sakshi

తల్లాడ: వరి ధాన్యం విక్రయించి 30 నుంచి 40 రోజులు దాటినా నగదు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తల్లాడలో మంగళవారం రైతులు సొసైటీ కార్యాలయం నుంచి సీఈఓ నాగబాబు, సిబ్బందిని బయటకు పంపించి ధర్నా చేశారు. ధాన్యం డబ్బులు చెల్లించాకే జీలుగు, పిల్లి పెసర విత్తనాలు పంపిణీ చేయాలని, డబ్బు లేకపోవడంతో పచ్చిరొట్ట విత్తనాలు ఎలా కొనాలని ప్రశ్నించారు. దీంతో పోలీసులు చేరుకుని ఖమ్మం డీఎస్‌ఓతో ఫోన్‌లో మాట్లాడగా.. రెండు రోజుల్లో ధాన్యం డబ్బులు జమ అవుతాయని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాపా సుదాకర్‌, దుండేటి వీరారెడ్డి, దగ్గుల రఘుపతిరెడ్డి, గుండ్ల వెంకటేశ్వర్లు, కటికి కిరణ్‌, ఎర్రి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement