ఉరుకులు.. పరుగులు! | Sakshi
Sakshi News home page

ఉరుకులు.. పరుగులు!

Published Sat, Nov 4 2023 12:04 AM

ఎంపీపీ గౌరిని ద్విచక్రవాహనంపై కూర్చోపెట్టి పరుగు పెడుతున్న మురళి - Sakshi

ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేఎంసీలోని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయగా, కొంత ఉత్కంఠ చోటు చేసుకుంది. తుమ్మల అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాల్సిన రఘునాథపాలెం ఎంపీపీ భూక్యా గౌరి కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికే తుమ్మల తదితరులు ఆర్‌ఓ కార్యాలయంలోకి వెళ్లగా, ఆ తర్వాత వచ్చిన గౌరిని 100 మీటర్ల ఆవలే పోలీసులు నిలిపేశారు. ఇంతలోనూ ముహూర్తం సమీపించడంతో కార్పొరేటర్‌ కమర్తపు మురళి హడావుడిగా బయటకు వచ్చి ఆమెను ద్విచక్ర వాహనంపై కార్యాలయంలోకి తీసుకెళ్లారు. – స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, ఖమ్మం

గౌరిని కార్యాలయంలోకి తీసుకెళ్తూ...
1/1

గౌరిని కార్యాలయంలోకి తీసుకెళ్తూ...

Advertisement
Advertisement