శతాధిక వృద్ధురాలు మృతి | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలు మృతి

Published Wed, Nov 15 2023 12:20 AM

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - Sakshi

ఎర్రుపాలెం: మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కూరపాటి తిరుపతమ్మ(100) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, మంగళవారమే ఆమె 100వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు కుటుంబీకులు ఏర్పాట్లుచేశారు. అయితే, పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కన్నుమూయగా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహం వద్ద వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, శీలం ప్రతాపరెడ్డి, కూరపాటి సుందరమ్మ, కూరపాటి యశోద, అయిలూరి నాగిరెడ్డి, ముక్కర చిన్నలక్ష్మారెడ్డి, కూరపాటి కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, జయరావు తదితరులు నివాళులర్పించారు.

గుర్తు తెలియని వ్యక్తి...

ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి(35) మంగళవారం మృతి చెందాడు. ఉదయం 10 గంటల సమయాన ఖమ్మం పాత బస్టాండ్‌ వద్ద నోటి నుంచి రక్తస్రావమవుతూ అపస్మారక స్థితిలో వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేస్తుండగానే ఆయన మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59107 నంబర్‌లో సంప్రదించాలని ఖమ్మం వన్‌టౌన్‌ సీఐ స్వామి సూచించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి...

రఘునాథపాలెం: మండలంలోని శివాయిగూడెం వద్ద ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పువ్వాడనగర్‌కు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు ఎం.అంజయ్య (60) పనికి వెళ్లి శివాయిగూడెం వద్ద ఆటో దిగి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అంజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

వైరా రిజర్వాయర్‌లో మహిళ మృతదేహం

వైరా/కొణిజర్ల: వైరా మున్సిపాలిటీ పరిధి ఇందిరమ్మ కాల నీ నుండి గండగలపాడు వెళ్లే మార్గంలో వైరా రిజర్వాయర్‌ కుడి కాల్వలో మంగళవారం కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం అమ్మపాలెం సమీపంలోని రాజ్యతండాకు చెందిన రాజిలిక ఉషారాణి(55)కి భర్త లేకపోవడంతో తన సోదరుల వద్ద నివసిస్తోంది. ఆమె కీళ్ల సంబంధించిన వ్యాధితో బాధతుండడమే కాక మతిస్థిమి తం లేక తరచుగా బయటకువెళ్లేది. గత నెల 28న కూడా అనాథాశ్రమం చిరునా మా తెలుసుకుని వస్తానని చెప్పి రాకపోవడంతో వెతుక్కుని వస్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గాలించినా ఫలితం లేక ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే మంగళవారం సాయంత్రం రిజర్వాయర్‌ కుడి కాల్వలో మృతదేహం బయటపడగా, పరిశీలించిన పోలీసులు ఉషారాణిదిగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని వెలికి తీయించారు.

సారా విక్రయదారుడికి రూ.లక్ష జరిమానా

కారేపల్లి: నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని కారేపల్లి ఎకై ్సజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మండలంలోని భాగ్యనగర్‌తండా గ్రామానికి చెందిన బానోతు రాకేష్‌ నుంచి మంగళవారం నాటుసారా స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే, గతంలోనూ ఆయన పట్టుబడగా బైండోవర్‌ చేశారు. కానీ బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ సారా తయారు చేయడంతో రూ.లక్ష జరిమాన విధించినట్లు ఎకై ్సజ్‌ ఎస్‌ఐలు రమణ, వసంతలక్ష్మి తెలిపారు.

ఉషారాణి (ఫైల్‌)
1/1

ఉషారాణి (ఫైల్‌)

Advertisement
Advertisement