ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జిగా జావీద్‌పాషా | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జిగా జావీద్‌పాషా

Published Sat, Nov 18 2023 12:10 AM

సదస్సులో మాట్లాడుతున్న శ్యాంసుందరం - Sakshi

ఖమ్మంలీగల్‌: ఖమ్మం న్యాయసేవాసంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ జావీద్‌పాషా బదిలీ అయ్యారు. ఆయనను ఖమ్మంలోనే ప్రిన్సిపల్‌ సీని యర్‌ సివిల్‌ జడ్జిగా నియమిస్తూ హైకోర్టు వర్గాల నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తాగునీటి అవసరాలకు సాగర్‌ జలాలు

పాలేరు నుంచి నేడు వైరా రిజర్వాయర్‌కు..

ఖమ్మంఅర్బన్‌: తాగునీటి పథకాలను నీరు అందించే జలాశయాలు అడుగంటకుండా అధికా రులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్లను నింపేందుకు సాగర్‌ ప్రధాన కాల్వ నుండి నీటిని విడుదల చేశారు. ప్రధాన కాల్వకు సాగర్‌ డ్యాం నుంచి రోజుకు 4,500 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ జలాలు శనివారం నాటికి పాలేరు రిజర్వాయర్‌కు చేరుకోనుండగా, అక్కడి నుంచి వైరా రిజర్వాయర్‌కు విడుదల చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీటి అవసరాల కోసం మొత్తంగా రెండు టీఎంసీల నీటిని డ్యాం నుంచి విడుదల చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారని చెప్పారు. అలాగే, ఇంకో రెండు టీఎంసీలను ఏపీ అవసరాల కోసం విడుదల చేయనుండడంతో నిరంతరరాయంగా పది రోజులు నీటి సరఫరా కొనసాగుతుంది. పాలేరు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులకు గాను 16.5 అడుగులు, వైరా రిజర్వాయర్‌లో 18 అడుగులకు గాను 9.10 అడుగుల మేర నీరు ఉంది. దీంతో తాగునీటి సరఫరాకు సమస్య రాకుండా సాగర్‌ జలాలను విడుదల చేశారు.

ఆదాయపు పన్ను

చట్టంపై అవగాహన

ఖమ్మంవ్యవసాయం: ఆదాయం పన్ను చట్టం, ఆన్‌లైన్‌ లావాదేవీలపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హైదరాబాద్‌ ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌(ఐఅండ్‌సీఐ) అధికారి కె.శ్యాంసుందరం తెలి పారు. ఖమ్మంలోని ఖమ్మం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో శుక్రవారం వ్యాపారులకు ఆదాయపు పన్ను చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరం మాట్లాడుతూ ప్రతీ కొనుగోలు, అమ్మ కం వివరాలు వివిధ శాఖల్లో ఆన్‌లైన్‌ అవుతుండగా, ఆ వివరాలన్నీ తమకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు ప్రతిఒక్కరు అవగా హన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. అలాగే, అధికారులు కేపీసీ.శేఖర్‌, ఎంవీ.సాయికుమార్‌ ఆదాయ పన్ను చెల్లింపులు, చట్టాలను వివరించారు. చాంబర్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో పాటు సోమా నర్సింహారావు, మన్నెం కృష్ణ, తల్లాడ రమేష్‌, డి.చిన్న వెంకటేశ్వర్లు, యడ్లపల్లి సతీష్‌, తేరాల్ర ప్రవీణ్‌, కె.ప్రవీణ్‌కుమార్‌, రాంపూడి నాగేశ్వరరావు, పి.అచ్చుతరావు పాల్గొన్నారు.

జావీద్‌పాషా
1/1

జావీద్‌పాషా

Advertisement

తప్పక చదవండి

Advertisement