వలలో చిక్కిన కొండచిలువ | Sakshi
Sakshi News home page

వలలో చిక్కిన కొండచిలువ

Published Thu, Dec 7 2023 12:26 AM

- - Sakshi

దమ్మపేట: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు పొంగిపొర్లుతుండగా, చేపల వేటకు వెళ్లిన వారి వలకు కొండచిలువ చిక్కింది. దమ్మపేటలో చెరువు పొంగి కాల్వ పారుతుండగా, స్థానికులు వలలతో చేపల వేట ప్రారంభించారు. అయితే, ఓ వ్యక్తి వలలో కొండచిలువ చిక్కడంతో ఆందోళనకు గురయ్యారు. వల నుంచి కొండచిలువను విడిపించే క్రమంలో అది దాడికి యత్నించగా, వారు కొండచిలువను చంపేశారు.

మౌలిక వసతుల కల్పన కోసం టెండర్ల ఆహ్వానం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఐ పరిధి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పీఓ ప్రతీక్‌జైన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న టెండర్‌దారులు జీఎస్టీ నంబర్‌, బ్యాంకు ఖాతా వివరాలతో ఐటీడీఏ కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రూ.2 వేలు చెల్లించి టెండర్ల దరఖాస్తులు తీసుకోవచ్చని వివరించారు.

Advertisement
Advertisement