సం‘క్రాంతి’ నిండాలి.. | Sakshi
Sakshi News home page

సం‘క్రాంతి’ నిండాలి..

Published Mon, Jan 15 2024 12:08 AM

- - Sakshi

ఉద్యోగంపైనే కోటి ఆశలు

కాంతిని విరజిమ్మే కాలం సంక్రాంతి నుంచే ఆరంభమవుతుంది. ఈ కాలం జీవితాల్లో కాంతులు నింపాలని అన్నివర్గాల ప్రజల ఆశిస్తున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇకనుంచి ఉద్యోగాల భర్తీ జరుగుతుందనే భావనతో ఉన్నాం.

– కె.వెంకట్‌, ఎం.ఏ., ఖమ్మం

పాడిపంటలు సమృద్ధిగా ఉండాలి..

వానలు లేక ఖరీఫ్‌లో పంటల దిగుబడి రాలేదు. ఇక యాసంగిలో సాగు గణనీయంగా పడిపోయింది. దీంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. వచ్చే సీజన్‌లోనైనా వానలు సమృద్దిగా కురవాలని, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.

– కాంపాటి శ్రీనివాసరావు, రైతు,

ఎదుళ్లచెరవు, తిరుమలాయపాలెం మండలం

సమస్యలు పరిష్కారం కావాలి

సూర్యుడు మకర సంక్రమణంలోకి చేరడంతో అంతా కాంతివంతమవుతుంది. ఆ కాంతి అందరి జీవితాల్లోనూ నిండాలి. ఉద్యోగులకు సంబంధించి పీఆర్‌సీ, డీఏ వంటి సమస్యలు పరిష్కారం కావడమే కాక రైతులు పాడిపంటలతో విరాజిల్లాలని కోరుకుంటున్నాం.

– తాడేపల్లి కిరణ్‌కుమార్‌, వ్యవసాయ మార్కెట్‌ ఉద్యోగి, ఖమ్మం

సిరిసంపదలు నిండాలి

కాంతివంతమైన జీవితం దక్కాలని, సిరిసంపదలతో తులతూగాలని కోరుతూ సంక్రాంతి జరుపుకుంటున్నాం. రైతులు పాడి పంటలతో విరాజిల్లితేనే అంతా బాగుంటుంది. ఈ సంక్రాంతి ప్రజలకు కొత్త కాంతులు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.

– ఆమంచి సురేష్‌ శర్మ, అర్చకులు, ఖమ్మం

ప్రభుత్వ పథకాలు దరిచేరాలి

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్నా. మహాలక్ష్మి పథకం కింద ఈ ఏడాది నుంచే నెలకు రూ.2,500 అందుతాయని ఆశిస్తున్నా. ఉచిత విద్యుత్‌ సౌకర్యం కూడా అందాలని నాలాంటి ఎందరో కోరుకుంటున్నారు.

– పాలపిందెల సరోజన, గృహిణి, పోచారం, కూసుమంచి మండలం

ఉద్యోగం సిద్ధించాలని వేడుకుంటున్నా..

సంక్రాంతి లోకానికి కొత్త వెలుగులు ఇవ్వడమే కాక నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. బీటెక్‌ పూర్తి చేసి రెండేళ్లయింది. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవు. ఇప్పుడైనా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే నాలాంటి వారికి మేలు జరుగుతుంది.

– మారగాని మహతి, బీటెక్‌, ఖమ్మం

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement