కలల కొలువు.. నిజమైన వేళ | Sakshi
Sakshi News home page

కలల కొలువు.. నిజమైన వేళ

Published Tue, Jan 30 2024 12:16 AM

- - Sakshi

● స్టాఫ్‌నర్స్‌లుగా ఉమ్మడి జిల్లా నుంచి 565 మంది ● రేపు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ● వైద్యరంగంలో కొనసాగుతూనే ఎంపిక

ఆకాంక్ష నెరవేరింది..

వైద్య రంగంలో స్థిరపడాలన్న నా ఆకాంక్షను కుటుంబీకులు ప్రోత్సహించారు. జీఎన్‌ఎం కోర్సు పూర్తిచేశాక కాంట్రాక్టు పద్ధతిపై గుండాల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేశా. ఎట్టకేలకు స్టాఫ్‌నర్స్‌గా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో నా కల నెరవేరింది.

– మోకాళ్ల స్వాతి, కొత్తూరు, ఇల్లెందు మండలం

వైరా మండలం నుంచి ...

వైరారూరల్‌: స్టాఫ్‌నర్సులుగా వైరా మండలంలోని గొల్లపూడి, తాటిపూడి గ్రామాలకు చెందిన గడ్డం మౌనిక, కట్టా పార్వతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, కుటుంబ సభ్యులు వారిని అభినందించారు.

వైద్యరంగంలో స్థిరపడాలన్న ఆకాంక్షకు అనుగుణంగా పట్టుదలతో చదివారు. అందుకు తగినట్లుగా జీఎన్‌ఎం పట్టా పొందారు. ప్రభుత్వ కొలువు కోసం సుదీర్ఘకాలంగా ఎదురు చూశారు. ఈ విషయంలో ఆలస్యమైనా నిరాశ చెందకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు విధానంపై లేదంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొనసాగుతూ వచ్చారు. ఇంతలోనే రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా... ప్రభుత్వం తాజాగా ఫలితాలు వెల్లడించింది. ఇందులో ఖమ్మం జిల్లా నుంచి 325మందికి, భద్రాద్రి జిల్లా నుంచి 240 మందికి అవకాశం దక్కింది. వీరికి హైదరాబాద్‌లో బుధవారం జరిగే సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందచేయనున్నారు. ఈమేరకు స్టాఫ్‌నర్స్‌లుగా ఎంపికై న పలువురి అభిప్రాయాలు ఇలాఉన్నాయి. – ఇల్లెందురూరల్‌

గ్రామంలో నేనే మొదటి ఉద్యోగిని..

మా గ్రామానికే చెందిన జర్పుల భద్రాజితో నా వివాహం జరిగింది. నన్ను నా భర్త జీఎన్‌ఎం చదివించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తూనే స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగం సాధించా. కుటుంబ సహకారంతో మా గ్రామంలో తొలి ప్రభుత్వ ఉద్యోగినిగా నిలిచా.

– గుగులోత్‌ శ్రావణి, అమర్‌సింగ్‌ తండా, ఇల్లెందు మండలం

అన్నదమ్ముల ఎంపిక

వైరా: ఒకే ఇంటి నుంచి ఇద్దరు స్టాఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్లు(స్టాఫ్‌ నర్స్‌)గా ఎంపికయ్యారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి చెందిన ఎల్‌ఐసీ అడ్వైజర్‌ ఎస్‌.కే.గౌస్‌మియా – మహబూబ్‌బీ దంపతుల కుమారులు హనీఫ్‌ పాషా, ఆసిఫ్‌పాషా రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్టాప్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఎంపికై నట్లు వెల్లడింది. అన్నమ్ములిద్దరికీ ఒకేసారి, ఒకే ఉద్యోగాలు లభించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.

ఆసిఫ్‌, హనీఫ్‌
1/5

ఆసిఫ్‌, హనీఫ్‌

2/5

కట్టా పార్వతి
3/5

కట్టా పార్వతి

గడ్డం మౌనిక
4/5

గడ్డం మౌనిక

5/5

Advertisement
Advertisement