గరం గరం గంజి ! | Sakshi
Sakshi News home page

గరం గరం గంజి !

Published Mon, Apr 8 2024 12:10 AM

ఉపవాస దీక్షాపరుల కోసం గంజిని 
తయారు చేస్తున్న దృశ్యం - Sakshi

● ఉపవాస దీక్షాపరుల కోసం తయారీ ● ఘుమఘుమలాడే వంటకం

సత్తుపల్లి: రంజాన్‌ మాసంలో హలీమ్‌ను తినేందుకు ఎంతగా ఇష్టపడతారో.. గరం గరం గంజిని సేవించేందుకు కూడా అంతే ఇష్టం చూపిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ ద్రవపదార్థమైన వేడివేడి గంజి(జావ)ను తాగితే మంచిదని భావిస్తారు. ప్రతి ఏటా రంజాన్‌ మాసంలో మసీదుల్లో ఈ పసందైన ఘమఘుమలాడే వంటకాన్ని మధ్యాహ్నాం నుంచి సాయంత్రం వరకు తయారు చేస్తారు. ఉపవాస దీక్షా పరులు ఈ గంజిని సేవిస్తే బడలిక తీరుతుంది. ముస్లిమేతరులు కూడా గంజి రుచులను ఆస్వాధిస్తారు. వేడివేడి గంజిలో బూందీని కలుపుకొని సేవిస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, మధిర, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో గంజిని తయారు చేస్తుంటారు.

గంజి తయారీలో..

మసీదులలో ఉపవాస దీక్షాపరుల కోసం గంజి (జావ)ని తయారుచేస్తారు. బియ్యం రవ్వ, టమాట, ఉల్లిగడ్డ, క్యారెట్‌, కొత్తిమీర, పచ్చిమిర్చి, మంచి నూనె, పప్పు, ప్రత్యేక మసాలా దినుసులను విని యోగిస్తారు. కొన్ని సమయాల్లో మటన్‌ ఖైమా కూడా వాడతారు. సుమారు ఐదారు గంటలు బాగా మరి గించి ఘుమఘుమలాడే గంజిని సిద్ధం చేస్తారు.

దీక్షల అనంతరం గంజిని సేవిస్తున్న ముస్లింలు
1/1

దీక్షల అనంతరం గంజిని సేవిస్తున్న ముస్లింలు

Advertisement
Advertisement