ఖమ్మంవైద్యవిభాగం: ప్రచండ భానుడి ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్న బాలింతలు వేడి తట్టుకోలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు వార్డుల్లో ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు కొన్నిచోట్ల కూలర్లు బిగించారు. అయినా గాలి సరిపోక పలువురు ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు.