చదువుతోనే ఆదివాసీల జీవితాల్లో వెలుగులు | Sakshi
Sakshi News home page

చదువుతోనే ఆదివాసీల జీవితాల్లో వెలుగులు

Published Fri, Nov 10 2023 5:18 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిన్నయ్య 
 - Sakshi

కాసిపేట(బెల్లంపల్లి): చదువుతోనే ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నిండుతాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. మండలంలోని దేవాపూర్‌ సల్ఫాలవాగులో గురువారం దండారీ దర్బార్‌ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఉదయం నుంచి దండారీ నృత్యం చేస్తూ దర్బార్‌ నిర్వహించారు. అధికసంఖ్యలో హాజరైన ఆదివాసీలు, గిరిజనేతరులు దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఆదివాసీ తమపిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రూ.25 లక్షలతో ఆదివాసీలకు కమ్యూనిటీహాల్‌ నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చిన భక్తులకు దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ ఆధ్వర్యంలోభోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, మద్దిమాడ సర్పంచ్‌ ఆడె జంగు, జెడ్పీటీసీ చంద్రయ్య, ఓరియంట్‌ హెచ్‌ఎం జీఎం కులకర్ణి, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement