దివాకర్‌రావు ఆస్తులు రూ.8.87 కోట్లు | Sakshi
Sakshi News home page

దివాకర్‌రావు ఆస్తులు రూ.8.87 కోట్లు

Published Fri, Nov 10 2023 5:18 AM

నామినేషన్‌ వేసేందుకు వచ్చిన దివాకర్‌రావు
 - Sakshi

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నడిపెల్లి దివాకర్‌రావు కుటుంబ ఆస్తి విలువ దాదాపు రూ.8.87 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో తన సొంత ఆస్తులు, వారసత్వంగా వచ్చినవి, తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులు, భూములు, బంగారంకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతేడాది ఇన్‌కంట్యాక్స్‌ తన పేరిట రూ.1.90 లక్షలు, తన భార్య పేరిట రూ.4,01,550లు చూపించారు. చరాస్థులు ఆయన పేరిట రూ.86,22,715, భార్య పేరిట రూ.16,84,153, స్థిరాస్తులు తన పేరిట రూ. 2,87,50,000, భార్య పేరిట రూ.40 లక్షలు, వారసత్వంగా వచ్చిన ఆస్తులు తన పేరిట రూ.2.05 కోట్లు, భార్య పేరిట రూ.2.50 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన చేతిలో రూ.1.20 లక్షలు, తన భార్య వద్ద రూ.90 వేల నగదు ఉన్నట్లుగా చూపించారు. మహేశ్వరం మండలంలోని తూప్రాలో, మంచిర్యాల, పాతమంచిర్యాలలో ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, మంచిర్యాల, పాతమంచిర్యాలలో రెండు ఇళ్లు, రూ.13.20 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా చూపించారు. తన పేరిట ఎక్కడా ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదన్నారు. బ్యాంకులు, ఇతరత్రా అప్పులు తన పేరిట లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement