కోనేరు కోనప్ప ఆస్తులు రూ.89.93 లక్షలు | Sakshi
Sakshi News home page

కోనేరు కోనప్ప ఆస్తులు రూ.89.93 లక్షలు

Published Fri, Nov 10 2023 5:18 AM

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
 - Sakshi

కౌటాల: సిర్పూర్‌(టి) నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆస్తులు రూ.89.93 లక్షలు ఉన్నట్లు గురువారం ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు. యూనియన్‌ బ్యాంకు కాచిగూడలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.74,069, ఎస్‌బీఐ సెక్రెటరేట్‌ శాఖలో రూ. 3,06,958, కాగజ్‌నగర్‌ ఎస్‌బీఐ బ్యాంకులో ఎన్నికల కోసం రూ.40,00,500, రూ.16 లక్షల విలువైన ఇన్నోవా కారు, ఐదు తులాల బంగారం రూ.3 లక్షలతో కలిపితే రూ.63,89,527 లక్షల చరాస్తులున్నట్లు చూయించారు. స్థిరాస్తిలో కాగజ్‌నగర్‌ మండలం సర్వే నంబర్‌ 47/13లో ఓ 3.300 గుంటలు, సర్వే నెంబర్‌ 176/2 కొత్తపేటలో 0.2000 గుంటల భూమి ఉన్నట్లు వెల్లడించారు. గుంటూర్‌ కాలనీలో 3600 స్క్వేర్‌ఫీట్ల ఇల్లు ఉన్నట్లు చూయించారు. సతీమణి కోనేరు రమాదేవి పేరిట పోస్టాఫీసుల్లో రూ. 3,715, రూ.14వేలు, రూ.14వేలు, రూ.14 వేల నగదుతో పాటు 40 తులాల బంగారం ఉన్నట్లు ఇందుకు ధర రూ. 24 లక్షలతో మొత్తం 26,03,715 ఉన్నట్టు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement