బీఆర్‌ఎస్‌కు గుగ్లోత్‌ రవినాయక్‌ రాజీనామా

13 Nov, 2023 23:52 IST|Sakshi
మాట్లాడుతున్న రవినాయక్‌

ఆసిఫాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రెబ్బెన మండలం గోలేటికి చెందిన సేవాలాల్‌ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షు డు, మాజీ ఉప సర్పంచ్‌ గుగ్లోత్‌ రవినాయక్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఒడ్డెర, నాయీబ్రాహ్మణ సంఘంతోపాటు ప లు సంఘాల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 15 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంతోపాటు బీఆర్‌ఎస్‌లో చురుకుగా పనిచేస్తున్నా పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేద ని ఆరోపించారు. ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు తమను ఆహ్వానించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. త్వ రలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపా రు. నాయకుల వైఖరిని నిరసిస్తూ అవసరమైతే నోటాకు ఓటు వేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు