చట్టాలపై అవగాహన అవసరం | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Published Sun, Nov 19 2023 1:34 AM

అవగాహన కల్పిస్తున్న శారద - Sakshi

ఆసిఫాబాద్‌అర్బన్‌: చట్టాలపై మహిళలకు అవగాహన అవసరమని మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త శారద అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో లైంగిక వేధింపుల నిరోధక, నిషేధ, పరిష్కారం చట్టం– 2013పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపక రంగాల్లో రాణిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు, కార్మికులపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేందుకు చట్టాలు తెలుసుకోవాలన్నారు. గృహ హింస నిరోధక చట్టం– 2005, తప్పనిసరి వివాహ నమోదు చట్టం– 2002, వరకట్న నిషేధ చట్టం– 1961, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిరోధక చట్టం– 1964, ఇతర చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం ఆర్థిక నిపుణులు సాగర్‌.. మహిళల అ భివృద్ధికి బ్యాంకుల ద్వారా అందించే ఆర్థిక చే యూత పథకాలు, బీమా పథకాలు, నెట్‌ బ్యాంకింగ్‌ తదితర అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో డీహెచ్‌ఈడబ్ల్యూ అ కౌంటెంట్‌ మమత, మెడికల్‌ ప్రాజక్టు అధికా రి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement