నిజాయతీపరులకే తొలిఓటు | Sakshi
Sakshi News home page

నిజాయతీపరులకే తొలిఓటు

Published Mon, Nov 20 2023 1:36 AM

జిల్లా కేంద్రంలో తొలిసారి ఓటుహక్కు పొందిన విద్యార్థినులు - Sakshi

● విద్య, వైద్యరంగాన్ని మెరుగుపర్చాలి ● నవయువ ఓటర్ల మనోగతం ● జిల్లాలో సగానికి పైగా యువ ఓటర్లు ● తొలిసారి ఓటు వినియోగించుకోనున్న 20 వేల మంది

ఆసిఫాబాద్‌: జిల్లాలో సగానికి పైగా యువ ఓటర్లు ఉన్నారు. ఇందులో చాలా మంది మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలిసారి ఓటు వేసేందుకు యువ ఓటర్లు ఉవ్విలూరుతున్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఎదురుచూస్తున్నారు. ‘నిజాయతీపరులకే తమ తొలిఓటు వేస్తాం.. విద్య, వైద్య రంగాలను మెరుగుపర్చాలి. యువత ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడంతో ఉద్యోగ కల్ప నకు చర్యలు తీసుకోవాలి..’ అని యువత కోరుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు గతంలో ఇచ్చిన హామీలు, అమలు తీరుపై విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి పలువురు యువతీయువకులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 4,53,538 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,26,844 మంది పురుషులు, 2,26,666 సీ్త్రలు, 28 ఇతరులు ఉన్నారు. 18 నుంచి 39 ఏళ్లలోపు యువతీయువకులు 2,44,796 మంది ఉండగా, సుమారు 20 వేల మంది కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు.

మార్పు రావాలి

తెలంగాణలో సంక్షేమ పథకాల అమలులో మార్పు రావాలి. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. వందల ఎకరాలు ఉన్న వారికి కాకుండా పేదలకు అండగా నిలవాలి. రాజకీయాల్లో యువతకు అవకాశం కల్పించాలి.

– బి.శ్రీవాణి, బీకాం సెకండియర్‌

ప్రతిభకు స్థానం కల్పించాలి

విద్య, ఉద్యోగాల్లో ప్రతిభకు స్థానం కల్పించాలి. మెరిట్‌ ఉన్న విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలి. ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువులకు అండగా నిలవాలి. ఉద్యోగవకాశాలు పెంచాలి. తొలిఓటును సద్వినియోగం చేసుకుంటాం.

– ఎం.రమ, డిగ్రీ

నిజాయతీపరులను ఎన్నుకుంటాం

నిజాయతీపరులైన నాయకులను ఎన్నుకుంటాం. ప్రస్తుతం రాజకీయాల్లో స్వార్థం పెరిగి ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదు. నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజల కష్టాలు తీర్చాలి. లీడర్లు సొంత ప్రయోజనాల కోసం పనిచేయడం సరికాదు.

– పాలె సునీత, డిగ్రీ

వైద్యసేవలు మెరుగుపర్చాలి

జిల్లాలో ఉన్నత విద్య కు అవకాశాలు పెంచడంతోపాటు వైద్యసేవలు మెరుగుపర్చాలి. పే దలకు కార్పొరేట్‌ దీటుగా సేవలందించాలి. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి, అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. జిల్లా వ్యాప్తంగా రైతు కుటుంబాలు అధికంగా ఉన్న నేపథ్యంలో వారి సమస్యలపై దృష్టి సారించాలి.

– లేకురె సందీప్‌, బీకాం ఫస్టియర్‌

హామీలు నెరవేర్చాలి

అభ్యర్థులు ఎన్నికల్లో ఇ చ్చిన హామీలు తప్పని సరిగా నెరవేర్చాలి. చా లా మంది నాయకులు ఎన్నికల సమయంలో ఇష్టారీతిన అమలుకాని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించాలి. జిల్లాలోని అనేక గ్రామాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

– ఉప్పరి ప్రత్యూష, డిగ్రీ

ప్రలోభాలకు లోనుకావొద్దు

ఎన్నికల్లో ఓటర్లు డబ్బు, ప్రలోభాలకు లోనుకావొద్దు. ఉచితాల పేరుతో నమ్మించే వారిని చూసి మోసపోవద్దు. నిజాయతీగా ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటుహక్కు వినియోగించుకోవాలి. . ఉపాధి కల్పించే వారికే ఓటు వేయాలి.

– వి.తిరుపతి, డిగ్రీ

యువనాడి

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement

తప్పక చదవండి

Advertisement