ఓటు వేయాలంటే ఆరు కిలోమీటర్లు | Sakshi
Sakshi News home page

ఓటు వేయాలంటే ఆరు కిలోమీటర్లు

Published Fri, Nov 24 2023 7:38 AM

లోహా గ్రామం  - Sakshi

● లోహా గ్రామస్తులకు కర్జిలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు

దహెగాం(సిర్పూర్‌): అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలంటే దహెగాం మండలం కర్జి పంచాయతీలోని లోహా గ్రామానికి చెందిన ఓటర్లు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన గ్రామమైన లోహాలో 30 గిరిజన కుటుంబాలు ఉండగా 150 జనాభా ఉంది. సుమారు వంద మంది ఓటర్లు ఉన్నారు. ప్రతీసారి ఎన్నికల సమయంలో గ్రామంలోని ఓటర్లు పంచాయతీ కేంద్రమైన కర్జికి వెళ్లాల్సి వస్తుంది. కాలినడకన ఓటు వేసేందుకు పలువురు నిరాసక్తి చూపుతుండటంతో ఓటింగ్‌శాతంపై ప్రభావం పడుతుంది. ఎన్నికల సమయంలో ఆయా పార్టీలు వాహనాలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల అధికారులే దూర ప్రాంతాల్లోని ఓటర్ల కోసం వాహన సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement