ఓటింగ్‌ పెంచేందుకు ‘ప్రత్యేకం’ | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌ పెంచేందుకు ‘ప్రత్యేకం’

Published Fri, Nov 24 2023 7:38 AM

జిల్లా కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో మహిళా పోలింగ్‌ కేంద్రం - Sakshi

ఆసిఫాబాద్‌: ఓటింగ్‌ పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓటింగ్‌ శాతం పెంపు, ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు జిల్లాలో వివిధ వర్గాలకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 599 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 305, సిర్పూర్‌ నియోజకవర్గంలో 294 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళలు, దివ్యాంగులు, యువత కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ముస్తాబు చేస్తున్నారు. జిల్లాలో 10 మహిళా పోలింగ్‌ కేంద్రాలు, రెండు దివ్యాంగ పోలింగ్‌ కేంద్రాలు, 12 ఆదర్శ, రెండు యూత్‌ మేనేజ్‌డ్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

‘ఆసిఫాబాద్‌’లో 12..

ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 12 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో రెబ్బెన మండలంలోని (పీఎస్‌ నంబర్‌ 278) రెబ్బెన జెడ్పీహెచ్‌ఎస్‌లో, వాంకిడి మండలంలోని ఎంపీపీఎస్‌ పాఠశాల(పీఎస్‌ నం.225), ఆసిఫాబాద్‌ మండలంలోని ఇప్పలనవగాం పాఠశాల(పీఎస్‌ నం.229), కేస్లాగూడ (పీఎస్‌ నం.104), ఆసిఫాబాద్‌ జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాల(పీఎస్‌ నం.184)లో మహిళా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అ లాగే దివ్యాంగుల కోసం మోతుగూడ(పీఎస్‌ నం.. 218)లో కేంద్రాలు ఏర్పాటు చేయగా, నార్నూ ర్‌ లోని జెడ్పీ హైస్కూల్‌(పీఎస్‌ నం.13), గాది గూడ మండలం ఖడ్కి(పీఎస్‌ నం.22), గమ్నూర్‌(పీఎస్‌ నం.132), తిర్యాణి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠాశాల(పీఎస్‌ నం.149), జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ ఉన్నత పాఠశాల(పీఎస్‌ నం.198)లో ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు, వాంకిడి మండలం బెండార(పీఎస్‌ నం..233)లో యువ త కోసం పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

సిర్పూర్‌ నియోజకవర్గంలో..

సిర్పూర్‌ నియోజకవర్గంలో మొత్తం 14 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో పెంచికల్‌పేట్‌ ఎంపీపీఎస్‌ పాఠశాల(పీఎస్‌ నం.247), చింతలమానెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌(పీఎస్‌ నం. 198), సిర్పూర్‌–టి మండలంలోని మాకిడి ఎంపీపీఎస్‌(పీఎస్‌ నం.121), కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలభారతి హైస్కూల్‌(పీఎస్‌ నం.77), గుడ్లబోరిలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల(పీఎస్‌ నం.176)లో మహిళా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పా టు చేశారు. మర్తిడి ఎంపీపీఎస్‌(పీఎస్‌ నం. 222)లో దివ్యాంగుల కోసం, ఐనం పీఎస్‌ నం. 266), బొంబాయిగూడలోని ఎర్రగూడ(పీఎస్‌ నం.245), చింతలమానెపల్లి జెడ్పీస్కూల్‌(పీఎస్‌ నం.200), బెజ్జూర్‌ మండలం రెబ్బెన ఎంపీపీఎస్‌(పీఎస్‌ నం.235), కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్‌ స్కూల్‌(పీఎస్‌ నం.95), తుమ్మిడిహెట్టిలోని ఎంపీపీఎస్‌ (పీఎస్‌ నం. 169)లో ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

పండుగ వాతావరణం..

ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల రోజు పండు గ వాతావరణం ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఓటర్ల కోసం షామియానాలు ఏర్పాటు చేయడంతోపాటు తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన వారి కి అభినందనగా పూలబోకే ఇవ్వనున్నారు. ఇక మహిళా పోలింగ్‌ కేంద్రాల్లో స్థానికేతర మహిళా సిబ్బంది విధుల్లో ఉంటారు. యూత్‌ మేనేజ్‌డ్‌ కేంద్రాల్లో 25 నుంచి 30 ఏళ్ల యువతీయువకులు ఎన్నికల విధుల్లో ఉండేలా చూడనున్నారు. ది వ్యాంగుల పోలింగ్‌ కేంద్రంలోనూ ఎన్నికల విధుల్లో మొత్తం దివ్యాంగులే ఉంటారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేకంగా ర్యాంప్‌లు, వీల్‌చైర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఓటర్లకు సాయమందించేందుకు ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు అందుబాటులో ఉంటారు.

జిల్లాలో మహిళలు, దివ్యాంగులు, యువత కోసం పోలింగ్‌ కేంద్రాలు

12 ‘ఆదర్శ’ కేంద్రాలు సైతం ఏర్పాటు

వసతులతో తీర్చిదిద్దుతున్న ఎన్నికల అధికారులు

జన్కాపూర్‌లో ఆదర్శ పోలింగ్‌ కేంద్రం
1/1

జన్కాపూర్‌లో ఆదర్శ పోలింగ్‌ కేంద్రం

Advertisement
Advertisement