ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి

Published Sun, Mar 26 2023 1:42 AM

- - Sakshi

కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రమాదాలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన శనివారం మధ్యాహ్నం రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. జాతీయ రహదారి – 216లో ప్రమాదాలు జరగకుండా అప్రోచ్‌ రోడ్డులోకి స్పీడ్‌ బ్రేకర్లు, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లకు విధుల నిర్వహణకు ముందు డ్రంకెన్‌ డ్రైవ్‌, వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పెనమలూరు వద్ద జాతీయ రహదారిపై రద్దీ సమయాల్లో ఇసుక లారీలను అనుమతించొద్దని ఆదేశించారు. 15 ఏళ్లు నిండిన అన్ని ప్రభుత్వ వాహనాలకు ఏప్రిల్‌ నుంచి రెన్యువల్‌ను నిలిపివేశారని, వాటిని వేలం వేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదే శాలు జారీ చేసిందని జిల్లా రవాణాశాఖ అధి కారి ఎం.సీతాపతిరావు తెలిపారు. డీఎస్పీ రమేష్‌బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్‌ టి.పెద్ది రాజు, డీఎంహెచ్‌ఓ గీతాబాయి, జాతీయ రహదారుల ఇంజినీరింగ్‌ అధికారి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement