నాయీబ్రాహ్మణుల సభ పోస్టర్‌ ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

నాయీబ్రాహ్మణుల సభ పోస్టర్‌ ఆవిష్కరణ

Published Fri, Apr 21 2023 1:22 AM

- - Sakshi

భవానీపురం(విజయవాడపశ్చిమ): తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న నాయీబ్రాహ్మణ కృతజ్ఞతా సభకు సంబంధించి ముద్రించిన పోస్టర్‌ను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఆవిష్కరించారు. గురువారం మంత్రి జోగి రమేష్‌ను ఏపీ నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిద్ధవటం యానాదయ్య ఇబ్రహీంపట్నంలోని మంత్రి ఇంట్లో కలిసి కృతజ్ఞతా సభ ఆహ్వానాన్ని అందించారు. అనంతరం ఆహ్వానపత్రాన్ని మంత్రి జోగి రమేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల్లోని ప్రతి కులం అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలందరూ కృతజ్ఞులై ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఏపీ ఆలయాల కేశఖండన నాయీబ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, ఉపాధ్యక్షుడు ఆర్‌వీ రమణ, కోశాధికారి ఏజీఎల్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

గుడివాడ టౌన్‌(నందివాడ): ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మానేపల్లి యెషయా(35) అదే గ్రామానికి చెందిన ఓ తెలుగుదేశం నాయకుని ఇంట్లో పనిచేస్తుంటారు. అయితే గురువారం మధ్యాహ్నం యెషయా తాను పనిచేసే నాయకుని ఇంట్లోని గొడ్లచావిడిలో ఉరికి వేలాడుతుండగా.. ఆ ఇంట్లోనే పనిచేస్తున్న మరో వ్యక్తి దీనిని గమనించి యజమానికి తెలిపాడు. దీంతో యెషయాను కిందకు దించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యెషయాకు భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శిరీష తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement