బందరు అబ్బాయి.. జపాన్‌ అమ్మాయి | Sakshi
Sakshi News home page

బందరు అబ్బాయి.. జపాన్‌ అమ్మాయి

Published Sat, Oct 28 2023 1:56 AM

వివాహం చేసుకున్న దినకర్‌, అమిషినోకి - Sakshi

మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నంకు చెందిన అబ్బాయి, జపాన్‌ అమ్మాయి మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ప్రేమకు ఎల్లలు లేవని ఈ వివాహంతో మరోసారి నిరూపించారు. జపాన్‌ సంతతికి చెందిన అమ్మాయి అమిషినోకి, మచిలీపట్నంకు చెందిన యక్కల సుందర మణికంఠ దినకర్‌ లు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. దినకర్‌, అమిషినోకి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

షినోకి అమెరికా గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌. వీరి వివాహం పెద్దల సమక్షంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని నగిరి చెన్నయ్య మార్కెట్‌రోడ్డులో నివాసం ఉండే న్యాయవాది యక్కల సుబ్బారావు, పద్మావతి దంపతుల కుమారుడు దినకర్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ప్రేమజంట మచిలీపట్నంలోని ఎస్‌. కన్వెన్షన్‌ హాలులో వివాహం చేసుకున్నారు. వీరిని బంధుమిత్రులు ఆశీర్వదించారు.

Advertisement
Advertisement