నెరవేరిన సీఎం వైఎస్‌ జగన్‌ హామీ | Sakshi
Sakshi News home page

నెరవేరిన సీఎం వైఎస్‌ జగన్‌ హామీ

Published Thu, Nov 2 2023 4:30 AM

డయాలసిస్‌ సెంటర్‌లో బెడ్లు, పరికరాలు    - Sakshi

అవనిగడ్డ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన హామీ నెరవేరింది. కిడ్నీ బాధితుల కోసం అవనిగడ్డలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌ మంత్రులు విడదల రజని, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, నందిగం సురేష్‌, పలువురు ఎమ్మెల్యేల చేతుల మీదుగా గురువారం ప్రారంభంకానుంది. అపోలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డయాలసిస్‌ సెంటర్‌లో ఆరు డయాలసిస్‌ యంత్రా లను ఏర్పాటు చేశారు. రోజుకు మూడు షిప్టుల్లో 18 మందికి డయాలసిస్‌ సేవలు అందించేలా వస తులు కల్పించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 52 మంది డయాలసిస్‌ రోగులు ఉన్నారు. ప్రస్తుతం వారంతా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇక నుంచి వారందరికీ అవనిగడ్డలోనే మెరుగైన డయాలసిస్‌ సేవలు అందనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అడిగిన వెంటనే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంతో డయాలసిస్‌ పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని రైతుల ప్రధాన సమస్య అయిన 22ఏ నిషేధిత భూముల సమస్యను ముఖ్యమంత్రి ఇప్పటికే పరిష్కరించారు. ఇప్పుడు డయాలసిస్‌ సెంటర్‌ కూడా అందుబాటులోకి రావడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

అవనిగడ్డలో సిద్ధమైన డయాలసిస్‌ సెంటర్‌ నేడు పలువురు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం

Advertisement
Advertisement