విద్యాభివృద్ధికి బాటలు వేసిన అబుల్‌కలాంఆజాద్‌ | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి బాటలు వేసిన అబుల్‌కలాంఆజాద్‌

Published Sun, Nov 12 2023 1:46 AM

అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న సీపీ టీకే రాణా  - Sakshi

సీపీ టీకే రాణా

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన గొప్పవ్యక్తి తొలి విద్యాశాఖ మంత్రి మౌలానాఅబుల్‌కలాంఆజాద్‌ అని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణి కొనియాడారు. అబుల్‌ కలాం అజాద్‌ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబుల్‌కలాం జయంతి సందర్భంగా దేశంలో నవంబర్‌ 11న ‘జాతీయ విద్యా దినోత్సవం’ జరుపుకుంటున్నామన్నారు. దేశంలో విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి అంకిత భావంతో పని చేసి, 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే ముందుకు తెచ్చారన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ‘భారత రత్న’ ఇచ్చి ఆయన్ను గౌరవించిందన్నారు. కార్యక్రమంలో డీసీపీ విశాల్‌ గున్ని, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement