కలర్‌ఫుల్‌ కారిడార్‌ | Sakshi
Sakshi News home page

కలర్‌ఫుల్‌ కారిడార్‌

Published Mon, Nov 20 2023 1:24 AM

జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలతో పచ్చదనం నిండి ఉన్న దృశ్యం - Sakshi

కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2023
ద్వీపంలో ఫన్‌ డే
పచ్చందాలతో సుందరంగా జాతీయ రహదారి

నేడు స్పందన

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి స్పందన కార్యక్రమం ప్రారంభిస్తామని కలెక్టర్‌ పి. రాజాబాబు ఆదివారం తెలిపారు. డివిజన్‌, మండల స్థాయిలోనూ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

హోరాహోరీగా క్రీడా పోటీలు

శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ రజతోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి.

u8లో

రామవరప్పాడు : విజయవాడ–కోల్‌కత్తా జాతీయ రహదారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చే నగర సందర్శకులతో పాటు తరచూ వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి ఎక్కువగా ఉన్న ఈ మార్గాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. రామవరప్పాడు సర్కిల్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు కారిడార్‌ అభివృద్ధి, సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

రూ. 12 కోట్లతో నిర్మాణ పనులు..

ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ. 12 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లు, అర్బన్‌ గ్రీనరీ–బ్యూటిఫికేషన్‌ విభాగం మరో రూ. 4 కోట్ల నిధులు విడుదల చేసింది. జాతీయ రహదారికి ఇరువైపులా పనులు వీఎంసీ చేపట్టగా, సుందరీకరణ పనులను ఆంధ్రప్రదేశ్‌ గ్రీనరీ–బ్యూటిఫికేషన్‌ విభాగం నిర్వహిస్తోంది. డ్రెయిన్లు, ఫుట్‌పాత్‌ పనులను వీఎంసీ ప్రారంభించి గ్రానైట్‌ ఫ్లోరింగ్‌తో తీర్చిదిద్దుతోంది. రామవరప్పాడు నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టు వరకు ఐదు జంక్షన్‌లుగా పనులు విభజించి విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చేస్తోంది. రామవరప్పాడు జంక్షన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు మొత్తం ఫుట్‌పాత్‌ ఫ్లోర్‌ను గ్రానైట్‌తో కప్పి రహదారికి ఇరు వైపులా ఆకర్షణీయమైన కళారూపాలు ఏర్పాటు చేయనున్నారు.

ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు..

ఈ కారిడార్‌ నిర్మాణ పనులకు అడ్డంకిగా మారిన ఆక్రమణలను ఇటీవల వీఎంసీ, పంచాయతీ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో తొలగించారు. రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు ఫుట్‌పాత్‌పై ఆక్రమణలు తీసివేశారు. హోటల్స్‌, దుకాణాలు, రైస్‌ షాపులు వంటి ఆక్రమణలు ఖాళీ చేయించారు. పలువురు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ఈ పనులను స్వయంగా వీఎంసీ కమిషనర్‌, అడిషనల్‌ కమిషనర్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆయా పంచాయతీల కార్యదర్శులకు సూచనలిస్తున్నారు.

ఆకట్టుకునేలా పచ్చదనం..

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి చేరుకునే సందర్శకులను ఆకట్టుకునేలా జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనంతో ఆహ్వానం పలికేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ గ్రీనరీ ఏర్పాటు చేసేందుకు గ్రీనరీ–బ్యూటిఫికేషన్‌ విభాగం బాధ్యతలు స్వీకరించింది. రహదారికి ఇరు వైపులా 34 రకాల ఆకర్షణీయమైన చెట్లను నాటుతున్నారు. రామవరప్పాడు జంక్షన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకూ ఆకర్షణీయమైన రంగులు వేయనున్నారు. ఫుట్‌పాత్‌లపై పూలకుండీలు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. అతి త్వరలో ఈ పనులను పూర్తి చేసి నగరానికి సుందరమైన ముఖ ద్వారంగా జాతీయరహదారిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తారు.

7

న్యూస్‌రీల్‌

గుంటూరు డివిజన్‌ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు

లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే శబరిమల భక్తుల సౌకర్యార్థం గుంటూరు డివిజన్‌ మీదుగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని డివిజన్‌ సీనియర్‌ డీసీఎం దినేష్‌కుమార్‌ ఆదివారం వెల్లడించారు. సికింద్రాబాద్‌–కొల్లం(07219) ప్రత్యేక రైలు ఈనెల 26, డిసెంబర్‌ 3వ తేదీల్లో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొల్లం చేరుకుంటుందన్నారు. అదేవిధంగా కొల్లం–సికింద్రాబాద్‌(07130) రైలు ఈనెల 28, డిసెంబర్‌ 5వ తేదీల్లో కొల్లం స్టేషన్‌ నుంచి అర్ధరాత్రి 2.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. కాచిగూడ–కొల్లం(07123) రైలు ఈనెల 22, 29 తేదీల్లో, డిసెంబర్‌ 6, కొల్లం–కాచిగూడ(07214) రైలు ఈనెల 24, డిసెంబర్‌ 1, 8వ తేదీలలో డివిజన్‌ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.

శరవేగంగా ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌ నిర్మాణ పనులు

నేషనల్‌ హైవేకు ఇరువైపులా అభివృద్ధి

ఐదు జంక్షన్‌లుగా విభజించి పనుల నిర్వహణ

ఆహ్లాదాన్ని పంచేందుకు గ్రీనరీ

తుది మెరుగులు దిద్దుతున్నాం

ఎయిర్‌పోర్టు కారిడార్‌ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నాం. రామవరప్పాడు నుంచి ఫుట్‌పాత్‌, జాతీయ రహదారిపై పారిశుద్ధ్యం మెరుగుదలకు ఆయా పంచాయతీలు, వీఎంసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రస్తుతం జాతీయ రహదారిపై బ్యూటిఫికేషన్‌ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.

– అడిషనల్‌ కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌)

వీఎంసీ, సత్యవతి

1/10

2/10

3/10

4/10

5/10

రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు  గ్రానైట్‌, టైల్స్‌ నిర్మాణ పనులు
6/10

రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు గ్రానైట్‌, టైల్స్‌ నిర్మాణ పనులు

7/10

8/10

9/10

10/10

Advertisement
Advertisement