అన్ని చర్యలూ తీసుకున్నాం | Sakshi
Sakshi News home page

అన్ని చర్యలూ తీసుకున్నాం

Published Sun, Dec 3 2023 1:32 AM

- - Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): తుపాను నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. శనివారం మధ్యాహ్నాం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ తీసుకున్న చర్యలను సీఎస్‌కు వివరించారు. రైతులు పండించిన ధాన్యం దెబ్బతినకుండా ముఖ్యంగా ముందస్తు చర్యలు చేస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 80 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కోత జరిగిందని అందులో 35 వేల మెట్రిక్‌ టన్నులు ఇప్పటికే మిల్లులకు తరలించామన్నారు. మిగిలిన ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఏడు మండలాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తుపాను సహాయ కార్యక్రమాల కోసం రూ. 2 కోట్లు అవసరమవుతాయని కలెక్టర్‌ సీఎస్‌కు వివరించారు.

Advertisement
Advertisement