ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

Published Mon, Apr 8 2024 1:50 AM

-

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ప్రకారం ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీసీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్‌ హెల్ప్‌లైన్‌, నేషనల్‌ గ్రీవెన్స్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ (ఎన్‌జీఎస్‌పీ) తదితర మార్గాల ద్వారా 964 ఫిర్యాదులు అందాయని వివరించారు. వీటిలో 949 ఫిర్యాదుల పరిష్కరించామని పేర్కొన్నారు. ఓటరు హెల్ప్‌లైన్‌ (1950) ద్వారా 124 ఫిర్యాదులు రాగా అన్నింటిని పరిష్కరించామని, ఎన్‌జీఎస్‌పీ ద్వారా 305 ఫిర్యాదుల్లో 304 పరిష్కరించినట్లు తెలిపారు. వాట్సాప్‌ నంబరు (9154970454) ద్వారా 21 ఫిర్యాదులు రాగా 20, కాల్‌ సెంటర్‌ (0866–2570051) ద్వారా 21 ఫిర్యాదులు రాగా వీటిన్నంటినీ పరిష్కరించినట్లు వివరించారు. కంప్లయింట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎంఎస్‌) ద్వారా 42 ఫిర్యాదులు రాగా 39, సీఈవో మెయిల్స్‌ ద్వారా 13 ఫిర్యాదులు రాగా తొమ్మిదింటిని పరిష్కరించినట్లు తెలిపారు. సీ–విజిల్‌ యాప్‌ ద్వారా 389 ఫిర్యాదులు రాగా వాటిని క్షుణ్ణంగాగా పరిశీలించి అన్నింటిని పరిష్కరించినట్లు వెల్లడించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వారీగా పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను తెలిపారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు 964 ఫిర్యాదులకు 949 పరిష్కారం

Advertisement
Advertisement