నాణ్యత బాగా ఉంది | Sakshi
Sakshi News home page

నాణ్యత బాగా ఉంది

Published Sat, Mar 11 2023 8:48 AM

- - Sakshi

మార్కెట్‌లో టిష్యూకల్చర్‌ అరటికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ రకం అరటి గెలల సైజు బాగా వస్తుంది. నాణ్య త బాగా ఉంటుంది. టిష్యూకల్చర్‌ అరటి సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మంచి ధరలు ఉండడంతో అరటి సాగు చేయడంపై రైతులు దృష్టి సారిస్తున్నారు.

– పి.రామాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి, కర్నూలు

గిట్టుబాటు ధరలు

లభించాయి

మేం పండించిన అరటికి గరిష్టంగా టన్నుకు రూ.22వేలు ధర లభించింది. రూ.22వేల ధరతో 9 టన్నుల అరటి విక్రయించాం. రూ.16వేల ప్రకారం 30 టన్నులు, రూ.14వేల ప్రకారం 150 టన్నులు విక్రయించాం.సుగంధాల అరటికి గరిష్టంగా రూ.8వేల వరకు ధర లభిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి గిట్టుబాటు ధరలు లభించాయి.

– గౌస్‌ఖాన్‌, కాల్వ గ్రామం,

ఓర్వకల్లు మండలం

1/1

Advertisement
Advertisement