బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

Published Sun, Sep 10 2023 1:00 AM

-

కొలిమిగుండ్ల: బెలుం – కొలిమిగుండ్ల రహదారిలో గ్యాస్‌ గోడౌన్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి కింద పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బెలుంకు చెందిన చాకలి సుబ్బరాయుడు(47) నాపరాతి గనులతో పాటు టిప్పర్లు నిర్వహిస్తున్నాడు. ఉమ్మాయిపల్లెకు చెందిన వ్యక్తి నాపరాతి గనికి చెందిన డబ్బులు బకాయి ఉండటంతో వసూలుకు శుక్రవారం రాత్రి సోదరుడు సుబ్బరావుతో కలిసి బైక్‌లో వెళ్లారు. తిరుగుప్రయాణంలో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో గ్యాస్‌ గోడౌన్‌ వద్ద అదుపు తప్పి కింద పడటంతో సుబ్బరాయుడు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు శనివారం అనంతపురంలోని ఓ ప్రవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి మృతి చెందాడు. పోలీసులు ప్రమాద వివరాలు సేకరించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement