నూతన ఆలయం.. ఆధ్యాత్మిక శోభితం | Sakshi
Sakshi News home page

నూతన ఆలయం.. ఆధ్యాత్మిక శోభితం

Published Thu, Nov 9 2023 1:12 AM

- - Sakshi

● గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణం ● టీటీడీ శ్రీవాణి పథకం ద్వారా ఉమ్మడి జిల్లాకు 32 ఆలయాల మంజూరు ● ఒక్కొక్క ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు ● స్థానిక గ్రామ కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో నిర్మాణం

కర్నూలు కల్చరల్‌: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారం లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార వర్గాలకు చెంది వెనకబడిన ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం/ రామాలయాల నిర్మాణాలు చేపట్టి భక్తుల చెంతే భగవంతుడు ఉండేలా ముందుకు సాగుతున్నారు. ఒక్కొక్క ఆలయానికి రూ.10 లక్షల చొప్పున ఉమ్మడి జిల్లాలో 32 దేవాలయాల నిర్మాణానికి రూ.3.20 కోట్లు నిధులను వెచ్చిస్తున్నారు. దేవదాయ శాఖ, సమరసత సేవా ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో దేవాలయాల నిర్మాణం జరుగుతోంది. మూడు విడతల్లో 32 ఆలయాలను గ్రామాల్లోని స్థానిక కమిటీలు నిర్మాణ బాధ్యతలను చేపట్టాయి. ఒక్కొక్క ఆలయాన్ని 10 సెంట్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. దేవతా మూర్తుల విగ్రహాలకు రూ. 2 లక్షలు, ఆలయ నిర్మాణానికి రూ.8 లక్షలు వెచ్చిస్తున్నారు.

మండలాల వారీగా..

మొదటి విడతలో దేవనకొండ మండలంలో 3, మిడ్తూరులో 2, పాములపాడులో 1, చాగలమర్రిలో 3, బనగానపల్లెలో 5,అవుకులో1, నంద్యాలలో 1చొప్పున మొత్తం 16 ఆలయాలు నిర్మిస్తున్నారు. రెండో విడతలో గోస్పాడులో 2, కొలిమిగుండ్లలో 1 మొత్తం 3, మూడో విడతలో ఆళ్లగడ్డలో 1, రుద్రవరంలో 1,శిరివెళ్లలో 5, ఉ య్యాలవాడలో1,కొలిమిగుండ్లలో2,పాణ్యంలో 3 చొ ప్పున మొత్తం 13 ఆలయాలు నిర్మాణం కానున్నా యి. మూడువిడతల్లో 32 దేవాలయాలు నిర్మించనున్నారు.

1/1

Advertisement
Advertisement