జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందాం | Sakshi
Sakshi News home page

జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందాం

Published Sun, Nov 12 2023 1:34 AM

మాట్లాడుతున్న ఏపీజీఈఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఉద్యోగులకు, ప్రజలకు అన్ని విధాలా మంచి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల సమాఖ్య(ఏపీజీఈఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. కర్నూలులోని కళాక్షేత్రంలో శనివారం ఏపీజీఈఎఫ్‌ జిల్లా శాఖ, జిల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏపీజీఈఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు రఘుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌ బీవై రామయ్య, ఏపీజీఈఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అరవపాల్‌, రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ఉ ద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ బత్తుల అంకమరావు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్ర భుత్వం ప్రజా సంక్షేమానికి, ఉద్యోగుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

● ప్రభుత్వం తెచ్చిన వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది.

● ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, 10 వేల మందికిపైగా కుటుంబాల్లో వెలుగులు నింపారు.

● వీఆర్‌ఏలకు నెలకు రూ.300 ప్రకారం డీఏ కింద చెల్లిస్తున్న మొత్తాన్ని టీడీపీ హయాంలో రద్దు చేయగా.. దీనిని రూ.500 పెంచుతూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం త్వరలోనే జీవో తెస్తోంది.

● 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధులకు ఉద్యోగా లు ఇచ్చారు. ఇంకా 2000 మందికిపైగా మిగిలిపోయారు. వీరిలో కనీసం 700 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంచి చేస్తున్నా ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి. దీనిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉంది.

● డిసెంబరు నెల చివరి లేదంటే జనవరి మొదటి వారంలో సీఎంకు సన్మాన కార్యక్రమం ఏపీజీఈఎఫ్‌ నిర్వహిస్తోంది.రెగ్యులర్‌ అవుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిరావాలి.

ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలు

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ, వలంటరీ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా యువతకు ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలు కల్పించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని, వారందరూ ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకమరావు, ఏపీజీఈఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు రఘుబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తమకు నమ్మకం ఉందని, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీజీఈఎఫ్‌ నగరశాఖ అధ్యక్షుడు గోవిందు, మాజీ అధ్యక్షడు జయశంకర్‌రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎల్లమద్దయ్య, జిల్లా నాయకులు శ్రీనివాసులు, భాస్కరరెడ్డి, మల్లేష్‌, బీఆర్‌ఆర్‌ కిశోర్‌, నారపరెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి

తీసుకెళ్లండి

ఏపీజీఈఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

వెంకటరామిరెడ్డి

హాజరైన ఉద్యోగులు
1/2

హాజరైన ఉద్యోగులు

2/2

Advertisement
Advertisement