పూజలందుకున్న సంగమేశ్వరుడు | Sakshi
Sakshi News home page

పూజలందుకున్న సంగమేశ్వరుడు

Published Tue, Nov 14 2023 1:54 AM

బయల్పడుతున్న ప్రాచీన సంగమేశ్వరాలయం  - Sakshi

కొత్తపల్లి: శ్రీశైలం నీటిమట్టం క్రమేపీ తగ్గుతుండడంతో ప్రాచీన సంగమేశ్వరాలయం బయట పడుతుంది. ఆదివారం నరక చతుర్దశి దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రాజశ్యామల, మహాలక్ష్మీ, గాయత్రీదేవి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదిజలాలతో అభిషేకాలు, కుంకుమార్చన, పుష్పార్చనలు వంటి విశేషపూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్పస్వామి మాలధారణ భక్తులు ప్రాచీన సంగమేశ్వరాలయంలో శివలింగానికి పూజలు నిర్వహించుకున్నారు.

ప్రాచీన సంగమేశ్వరాలయంలో 
పూజాకార్యక్రమాలు చేస్తున్న దృశ్యం
1/1

ప్రాచీన సంగమేశ్వరాలయంలో పూజాకార్యక్రమాలు చేస్తున్న దృశ్యం

Advertisement
Advertisement