జోరుమీదున్న మిర్చి ధర | Sakshi
Sakshi News home page

జోరుమీదున్న మిర్చి ధర

Published Thu, Nov 16 2023 6:27 AM

-

క్వింటా రూ.35,509

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఎండుమిర్చి ధర మరింత జోరందుకుంది. ఈ నెల 14న అత్యధికంగా రూ.27,525 ధర లభించింది. తాజాగా బుధవారం రూ.35,509లకు చేరుకుంది. ఒక్క రోజులోనే క్వింటాపై రూ.8,257 పెరగడం విశేషం. 2023–24లో మిర్చి సాధారణ సాగు 24,319.2 హెక్టార్లు ఉండగా.. రికార్డు స్థాయిలో 59139.6 హెక్టార్లలో సాగయింది. ఈ ఏడాది సాగు చేసిన మిర్చి మొదటి కోతలు కొనసాగుతున్నాయి. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు అమ్మకానికి 147 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.6,889, గరిష్ట ధర రూ.35,509 లభించగా.. మోడల్‌ ధర రూ.16,409 నమోదైంది.

● కాగా కందులకు రూ.9,819 ధర లభించింది. మార్కెట్‌కు కందులు కేవలం ఒక్క లాట్‌ మాత్రమే వచ్చింది.

● వేరుశనగకు గరిష్టంగా రూ.7,899, ఉల్లిగడ్డలకు రూ.4,099, కొర్రలు రూ.5,719 ధర పలికాయి.

వలంటీర్ల ఎంపికకు నేడు నోటిఫికేషన్‌

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో 95 గ్రామ, 77 వార్డు వలంటీర్ల ఎంపికకు ఈ నెల 16న జిల్లా కలెక్టర్‌ డా.జీ సృజన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈఓ జి.నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత గ్రామ/వార్డు సచివాలయాలపై ఉందన్నారు. ప్రజలకు, సచివాలయాలకు అనుసంధానకర్తలుగా(వలంటీర్లు) పనిచేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 17 నుంచి 20వ తేది వరకు స్వీకరిస్తామని, 21న దరఖాస్తుల పరిశీలన, 23న మౌఖిక పరీక్ష, 25న ఎంపికై న వారి వివరాలను వెల్లడిస్తామన్నారు. 28న శిక్షణ, 30వ తేది నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుందని సీఈఓ పేర్కొన్నారు.

Advertisement
Advertisement