వాటర్‌షెడ్‌ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం | Sakshi
Sakshi News home page

వాటర్‌షెడ్‌ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం

Published Fri, Nov 17 2023 1:50 AM

మాధవీలత 
 - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో వాటర్‌షెడ్‌ కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల అభివృద్ధి, ఉత్పాదతక పెంపు, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌(వాటర్‌షెడ్స్‌) ఎస్‌.మాధవీలత తెలిపారు. గురువారం వాటర్‌షెడ్స్‌ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గూడూరు ఎంపీడీఓగా పనిచేస్తున్న ఈమెకు ఇటీవల డివిజినల్‌ లెవల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(డీఎల్‌డీవో)గా పదోన్నతి లభించింది. ఆ మేరకు డ్వామా వాటర్‌షెడ్‌ అదనపు పీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పొలాల్లో పంటలు ఉన్నందున వాటర్‌షెడ్‌ కార్యక్రమాలు జరుగడం లేదని, వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున చేపడతామన్నారు.

Advertisement
Advertisement