రోడ్లకు నిధుల వరద | Sakshi
Sakshi News home page

రోడ్లకు నిధుల వరద

Published Wed, Nov 22 2023 1:54 AM

- - Sakshi

● నెలన్నరలో రూ.317.69 కోట్లతో 272 పనులకు అనుమతులు

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇతోధికంగా నిధులను విడుదల చేస్తోంది. కేవలం నెలన్నర వ్యవధిలోనే జిల్లాలో 272 వివిధ రకాల రోడ్ల నిర్మాణాలకు రూ.317.69 కోట్లతో పాలనా అనుమతులను మంజూరు చేసింది. ఈ పనులకు వెంటనే టెండర్లను ఆహ్వానించి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ వైపు సచివాలయ పరిధిలో వివిధ రకాల పనులు చేపట్టేందుకు ఒక్కో సచివాలయానికి రూ.40 లక్షలను విడుదల చేయడంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు (రోడ్లు, డ్రైనేజీలు) చేపట్టేందుకు వీలుగా ఒక్కో మండలానికి రూ.60 లక్షల ప్రకారం జిల్లాలోని 21 మండలాలకు రూ.12.10 కోట్లను మంజూరు చేసింది.

● సీఎంఓ ఆదేశాల మేరకు పీఆర్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో గుర్తించిన హైఇంపాక్ట్‌ రోడ్లకు సంబంధించి 39 పనులకు రూ.187.27 కోట్లకు పాలనా అనుమతులు వచ్చాయి.

● హై ఇంపాక్ట్‌ రోడ్లకు సంబంధించి ఆర్‌అండ్‌బీ పరిధిలోని 21 మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లకు రూ.45.60 కోట్లు, 9 స్టేట్‌ హైవేస్‌ రోడ్లకు రూ.34.40 కోట్లతో పాలనా అనుమతులను ఇచ్చారు.

● పత్తికొండ నియోజకవర్గంలో పీఎంజీఎస్‌వై కింద ఆరు రోడ్లు, రెండు హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణాలకు రూ.35.52 కోట్లను మంజూరయ్యాయి.

● కల్లూరు మండలం నాయకల్లు గ్రామం ఎన్‌హెచ్‌ 44 నుంచి ఈశ్వరమ్మ అవ్వ ఆశ్రమం వరకు రోడ్డును నిర్మించేందుకు రూ.80 లక్షలను మంజూరు చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement