ఆరేళ్ల బాలికౖపైలెంగికదాడికి యత్నం | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల బాలికౖపైలెంగికదాడికి యత్నం

Published Thu, Nov 30 2023 1:40 AM

-

కామాంధున్ని చితకబాదిన రైతులు

బొమ్మలసత్రం: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓకామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన ఘటన నంద్యాలలో బుధవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పొన్నాపురం కాలనీలో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. తండ్రి రోజువారి కూలిపనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి సమీపంలో కొంత కాలంగా ఓ యువకుడు టీవీ మెకానిక్‌ షాప్‌ నడుపుతున్నాడు. ఈక్రమంలో పాపతో పరిచయం పెంచుకున్నాడు. తండ్రి, తల్లి ఇంట్లో లేని సమయంలో యువకుడు చిన్నారికి మాయమాటలు చెప్పి సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై లైంగికదాడికి యత్నించడంతో గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో చిన్నారి జరిగిన విషయం రైతులకు వివరించింది. దీంతో ఆగ్రహించిన రైతులు యువకున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నీటి సంపులో పడి బాలిక మృతి

నందవరం: మండల పరిధిలోని జగ్గాపురం గ్రామంలో ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి కృష్ణవేణి(8)అనే బాలిక మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇవి..బుధవారం ఆ గ్రామంలోని మారెప్ప, రత్నమ్మ దంపతుల కుమార్తె కృష్ణవేణి తాగునీటి కోసం ఊరి చివరిలోని నీటి సంపు వద్దకు వెళ్లింది. సంపులో నీరు అడుగు భాగన ఉండడంతో తాడు సహాయంతో పైకి తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి నీటి అందులో పడిపోయింది. పక్కన్న ఉన్న బాలికలు కేకలు వేయడంతో చుట్టు పక్కవారు వచ్చి బాలికను బయటకు తీశారు. వెంటనే కృష్ణవేణిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదవశాత్తూ బాలిక మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

కేజీబీవీల్లోని పార్ట్‌టైంపీజీటీలకు వేతనాల పెంపు

కర్నూలు సిటీ: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పార్ట్‌టైం పీజీటీలుగా పనిచేస్తున్న వారి వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.26,759 పెంచుతూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనాలు డిసెంబర్‌ 1 నుంచే అమలులోకి రానున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 కస్తూర్భాగాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 59 మంది పార్ట్‌ టైం పీజీటీలు పనిచేస్తున్నారు. వేతనాలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బిల్లు చెల్లించకుంటే విద్యుత్‌ కనెక్షన్ల తొలగింపు

కర్నూలు(రాజ్‌విహార్‌): నెలవారి విద్యుత్‌ బిల్లు గురువారంలోపు చెల్లించిన పక్షంలో ఆయా కనెక్షన్లను శుక్రవారం నుంచి తొలగించాలని దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ కర్నూలు ఆపరేషన్స్‌ ఎస్‌ఈ ఎం. ఉమాపతి ఆదేశించారు. బుధవారం ఆయన కింది స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యుత్‌ బిల్లులు 100 శాతం వసూలయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఏఈ, ఏడీఈ, ఈఈలు తమ పరిధిలోని బిల్లులు చెల్లించని కనెక్షన్ల జాబితాపై కింది స్థాయి సిబ్బందితో సమీక్షించాలన్నారు.

Advertisement
Advertisement