Sakshi News home page

ప్రభుత్వ సాయంతో హోటల్‌ నడుపుతున్నా

Published Sun, Dec 3 2023 1:48 AM

- - Sakshi

మేం పేదలం. రెక్కల కష్టంతో బతికేవాళ్లం. నా భర్త ఉసేని పెయింటింగ్‌ పని చేస్తాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త సంపాదనతో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ప్రభుత్వం మాలాంటి వారికి ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా నాకు రూ.80వేలు వచ్చాయి. ఈ డబ్బుతో నేను మా ఊర్లోనే హోటల్‌ నడుపుతున్నా. ఇప్పుడు మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేవు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలువతో మా కుటుంబం సంతోషంగా ఉంది.

– నీలావతి, పెద్దతుంబళం, ఆదోని మండలం

చేసిన మేలు మరచిపోలేం

నేను, నా భర్త వెంకటరాముడు 1.5 ఎకరాల పొలాన్ని కౌలుకు చేసుకుంటున్నాం. మాది ఎస్సీ కులం. మూడు నెలల క్రితం వలంటీర్‌ ఇంటి వద్దకు వచ్చి కౌలు పత్రానికి దరఖాస్తు చేయించారు. ఏడు రోజుల్లోనే నాకు కౌలుకార్డు ఇచ్చారు. గతంలో ఆలూరుకు వెళ్లి దరఖాస్తు చేసుకునేదాన్ని. దీంతో సమయం వృథా అయ్యేది. కార్డు రావడానికి చాలా రోజులు పట్టేది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే కౌలుకార్డు ఇచ్చారు. మా లాంటి కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని ఇస్తున్నారు. పంట నష్ట పరిహారం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన మేలు మరచిపోలేం.

–లింగమ్మ,మొలగవల్లికొట్టాల,ఆలూరు మండలం

Advertisement
Advertisement