No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, Dec 13 2023 5:16 AM

-

మేం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం చేస్తున్నాం. కొద్ది రోజులుగా డయాలసిస్‌ వ్యాధితో నేను బాధపడుతున్నాను. కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద అక్టోబర్‌ నెలలో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చాను. నవంబర్‌ నెలలో మా గ్రామ సచివాలయం ఉద్యోగి, వలంటీర్‌ ఇంటికి వచ్చి నీకు డయాలసిస్‌ కింద ప్రభుత్వం రూ.10వేలు పింఛన్‌ మంజూరు చేసిందని చెప్పి డబ్బు అందించారు. డయాలసిస్‌ వ్యాధి గ్రస్తులకు ఎవరి ప్రమేయం అవసరం లేకుండా ఆస్పత్రిలో ఎంట్రీ చేసిన ఆధారంగా ప్రభుత్వమే పింఛన్‌ మంజూరు చేస్తుందని వారు చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకున్నా పింఛన్‌ వచ్చేది కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాకు మంజూరు చేసిన పింఛన్‌ సొమ్ము చికిత్స, మందులకు ఎంతో ఉపయోగపడుతోంది.

– గొల్ల నాగేష్‌, ఎర్రబాడు గ్రామం, గోనెగండ్ల మండలం

Advertisement
Advertisement