నేడు జిల్లాకు డీఎస్‌ఆర్‌పీ రాక | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు డీఎస్‌ఆర్‌పీ రాక

Published Wed, Dec 20 2023 2:30 AM

-

కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులను సందర్శించి అవసరమైన చోట భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను తెలియజేసేందుకు డీఆర్‌ఎస్‌పీ (డ్యామ్‌ భద్రతా సమీక్ష ప్యానెల్‌) బుధవారం జిల్లాకు రానుంది. ఈ ప్యానెల్‌ ఈ నెల 22వ తేది వరకు ఉమ్మడి జిల్లాలో పర్యటించనుంది. తొలిరోజు అయిన నేటి మధ్యాహ్నం 2 గంటలకు తుంగభద్ర నదిపై నిర్మించిన కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి (సుంకేసుల బ్యారేజీ)ను సందర్శించి ఆ బ్యారేజీ భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రెండో రోజు(గురువారం) వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను సందర్శించి, ఆ రోజు రాత్రికి నంద్యాలలో బస చేసి, మూడో రోజున అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లో గుర్తించిన అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారు. ఏఏ ప్రాజెక్టుల్లో ఏఏ లోపాలు ఉన్నాయి..వాటిని సరి చేసేందుకు అయ్యే బడ్జెట్‌ తయారీపై జలవనరుల శాఖ అధికారులకు సూచనలు చేస్తారు. ఈ ప్రతిపాదనలకు డ్యామ్‌ పునరుద్ధరణ, అభివృద్ధి ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులను కేటాయించనుంది. కాగా డీఆర్‌ఎస్‌పీలో చైర్మెన్‌, కేంద్ర జల సంఘం మాజీ చైర్మెన్‌ పాండ్య, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఎ.జానకీ రామరాజు, రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బీఎస్‌ఎన్‌ రెడ్డి, పూణేకు చెందిన రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఈశ్వర్‌ ఎస్‌.చాధారి, రిటైర్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.రాజు, హైదరాబాద్‌కు చెందిన సీడబ్ల్యూఆర్‌పీఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కేవీ రమణమూర్తి, రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ డా.పి రామరాజు, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కె.సత్యనారాయణ, రిటైర్డ్‌ సీఈ రౌతు సత్యనారాయణ, అర్కిటెక్‌ ఎండీ యాసిన్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement