నిధుల ఖర్చుపై కసరత్తు | Sakshi
Sakshi News home page

నిధుల ఖర్చుపై కసరత్తు

Published Thu, Mar 16 2023 1:36 AM

మినీ ట్యాంక్‌బండ్‌ పనులు చేపట్టే బంధం చెరువు  - Sakshi

కాంప్లెక్స్‌ల నిర్మాణం

చేపట్టాలని సూచన..

మానుకోట మున్సిపాలిటీలోని ఆఫీసర్స్‌ క్లబ్‌, ఇందిరాగాంధీ, తొర్రూరు బస్టాండ్‌ సెంటర్లలో కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టాలని మెజార్టీ కౌన్సిలర్లు సూచించినట్ల్లు తెలిసింది. వీటిద్వారా మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది. కాగా ఈనెల 2వ తేదీన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో సీపీఐ మున్సిపల్‌ఫ్లోర్‌లీడర్‌ అజయ్‌ సారథిరెడ్డి, సీపీఎం మున్సిపల్‌ఫ్లోర్‌ లీడర్‌ సూర్నపు సోమయ్యతో పాటు పలువురు కౌన్సి లర్లు కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఎమెల్సీ దృష్టికి తీసుకెళ్లారు.

మహబూబాబాద్‌: సీఎం కేసీఆర్‌ జిల్లాకు కేటాయించిన నిధుల ఖర్చు విషయంలో కసరత్తు జరుగుతోంది. మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కౌన్సిల్‌ సమావేశాలతో పాటు మంత్రి సత్యవతిరాథోడ్‌ సమక్షంలో చర్చించారు. సీఎం కేసీఆర్‌ జనవరి 12వ తేదీన జిల్లాలో పర్యటించి నాలుగు మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.125లక్షలు కేటాయించారు. ఇందులో మానుకోట మున్సి పాలిటీకి రూ.50కోట్లు, మరిపెడ, డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పైసా వృథాకావొద్దని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. ఈమేరకు చేపట్టే అభివృద్ధి పనులపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

13న మంత్రి సమక్షంలో సమీక్ష..

కలెక్టరేట్‌లోని మంత్రి చాంబర్‌లో ఈనెల 13వ తేదీ న మానుకోట మున్సిపాలిటీకి కేటాయించిన రూ. 50కోట్ల నిధుల ఖర్చుపై చర్చించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ శశాంక, మున్సిప ల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఫరీ ద్‌తో కలిసి మంత్రి సత్యవతిరాథోడ్‌ మానుకో టలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చ ర్చించారు. కాగా పట్టణ సుందరీకరణ పనులు చేపట్టాలని, ఆర్చ్‌లు, జంక్షన్ల అభివృద్ధి, ట్యాంక్‌బండ్‌ నిర్మాణాలు చేపట్టాలని మంత్రి సూచించారు.

ప్రతిపాదనలు ఇలా..

మానుకోట పట్టణ జనాభాతో పాటు వివిధ పనులపై వచ్చివెళ్లే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు ప్రతిపాదనలు తయారు చేశారు. కాగా సమీక్షలు, సమావేశాల అనంతరం ఆడిటోరియం ఏర్పాటు కోసం స్థల సేకరణ, కలెక్టరేట్‌ వెనుక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌,బంధం చెరువును మి నీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని,రోడ్లు,డ్రెయినేజీలు, జంక్షన్లు, ఆర్చ్‌లు, ఫుట్‌పాత్‌లు, వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌లో అదనపు పనులు, శానిటేషన్‌ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా కౌన్సిల్‌ సమావేశంలో చిన్న చిన్న మార్పులతో తీర్మానం చేయనున్నట్లు తెలిసింది.

మిగిలిన మున్సిపాలిటీల్లోనూ..

జిల్లాలోని మరిపెడ, డోర్నకల్‌, తొర్రూరు మున్సిపాలిటీల్లో కూడా నిధులు ఖర్చుపై కసరత్తు చేస్తున్నారు. డోర్నకల్‌లో 15వార్డులు ఉండగా 12వార్డుల్లో చైర్మన్‌, కౌన్సిలర్లు పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను నమోదు చేసుకున్నారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మిగిలిన వార్డుల్లో కూడా పర్యటించి పనుల ప్రతిపాదనలు చేసి అధికారులు, ఎమ్మెల్యే ఎదుట ప్రవేశపెట్టి నిర్ణ యం తీసుకోనున్నారు. మరిపెడలో కూడా సమస్యలు గుర్తించారు. చైర్మన్‌, కౌన్సిలర్లు వారుల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. తొర్రూరులో సైతం సమస్యలు తెలుసుకుంటున్నారు.

నాలుగు మున్సిపాలిటీలకు రూ.125కోట్లు కేటాయింపు

మంత్రి సత్యవతిరాథోడ్‌ సమక్షంలో

అభివృద్ధి పనులపై చర్చ

సుందరీకరణపై దృష్టిపెట్టాలని

మంత్రి సూచన

మినీ ట్యాంక్‌ బండ్‌గా బంధం చెరువు

1/1

Advertisement
Advertisement