ఎస్సార్‌ యూనివర్సిటీ వీసీగా దీపక్‌ గార్గ్‌ | Sakshi
Sakshi News home page

ఎస్సార్‌ యూనివర్సిటీ వీసీగా దీపక్‌ గార్గ్‌

Published Sun, Jun 4 2023 1:30 AM

దీపక్‌ గార్గ్‌  - Sakshi

హసన్‌పర్తి: ఎస్సార్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ప్రొఫెసర్‌ దీపక్‌ గార్గ్‌ నియమితులయ్యారు. ఈమేరకు ఎస్సార్‌ యూనివర్సిటీ చాన్సలర్‌ ఎ.వరదారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏఐపై ఎన్‌వీడీఐఏ–బీవీ పరిశోధన కేంద్రానికి డైరెక్టర్‌గా, వివిధ అంకుర పరిశ్రమలు, వెంచర్‌ఫండ్స్‌కు సాంకేతిక సలహాదారుడిగా దీపక్‌ గార్గ్‌ వ్యవహరించారు. అనేకమంది పరిఽశోధకులు దీపక్‌ గార్గ్‌ పర్యవేక్షణలో డాక్టరేట్‌ అందుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలుగా చేపట్టిన దీపక్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. ఎస్సార్‌ను రోల్‌మోడల్‌గా మార్చడమే తన లక్ష్యమన్నారు. దీపక్‌ గార్డ్‌కు అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement