నియోజకవర్గ అభివృద్ధికి కృషి : నాగజ్యోతి | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధికి కృషి : నాగజ్యోతి

Published Tue, Aug 22 2023 1:48 AM

-

ములుగు

పేరు: బడే నాగజ్యోతి

తండ్రి: నాగేశ్వరరావు

తల్లి: రాజేశ్వరి

భర్త: ఎట్టి జగదీశ్‌

కుమారుడు: గహన్‌ శివన్‌ ధ్రువణ్‌

గ్రామం: కాల్వపల్లి

మండలం: ఎస్‌ఎస్‌ తాడ్వాయి

జిల్లా: ములుగు

పుట్టిన తేదీ: 05–01–1994

కులం: ఆదివాసీ(ఎస్టీ)

రీలిజియన్‌ : హిందూ

నేషనాలిటీ: ఇండియన్‌

విద్యార్హత: ఎమ్మెస్సీ బాటనీ, బీఈడీ

అడ్రస్‌: కాల్వపల్లి

రాజకీయ అనుభవం,

పదవులు

● 2019లో కాల్వపల్లి సర్పంచ్‌గా ఎన్నిక

● 2019లో బీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ అభ్యర్థిగా 326 ఓట్లతో గెలుపొంది జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నిక

● 2023లో జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ మృతితో ఇన్‌చార్జ్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు

● ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో..

ములుగు: సీఎం కేసీఆర్‌ సోమవారం.. 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా ఇన్‌చార్జ్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘సీఎం కేసీఆర్‌ నాపై నమ్మకంతో బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. గెలిచిన తరువాత అన్ని వర్గాల ప్రజలను కలు పుకుపోతూ రాజకీయలకతీతంగా నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. నాకు ములుగు అ సెంబ్లీ టికెట్‌ కేటాయింపులో సహకరించిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రా థోడ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీని వాస్‌రెడ్డికి కృతజ్ఞతలు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో సీ ఎం కేసీఆర్‌ చెప్పినట్లు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఇతర పార్టీలకు డిపాజిట్‌ కూడా దక్కదు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నార న్నారు. ఇప్పటికే కేసీఆర్‌ ములుగు జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గెలిచిన తరువాత సీఎంతో మాట్లాడి మరిన్ని అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తా. నా గెలుపు కోసం సహకరించే ప్రతి ఒక్కరితో పాటు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటా. ఏ సమస్య వచ్చినా నేనున్నానే విషయం మరిచి పోవద్ధు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో నెలకొన్న ప్రతీ సమస్య పరిష్కరిస్తా’ అన్నారు.

Advertisement
Advertisement