బీసీల్లో రాజకీయ చైతన్యం అవసరం | Sakshi
Sakshi News home page

బీసీల్లో రాజకీయ చైతన్యం అవసరం

Published Sat, Aug 26 2023 1:32 AM

బీపీ మండల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వీసీ రమేష్‌ - Sakshi

కేయూ వీసీ తాటికొండ రమేష్‌

కేయూ క్యాంపస్‌: బీసీల్లో ఐక్యత, రాజకీయ చైతన్యం అవసరమని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య తాటికొండ రమేష్‌ అన్నారు. శుక్రవారం యూనివర్సిటీలో బీసీ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బిందేశ్వర్‌ ప్రసాద్‌ మండల్‌ 105వ జయంతి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సామాజిక అంశాలపై స్పందించాలని, ప్రశ్నించాలన్నారు. సంస్కరణలు, రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్‌ అన్నారు. 76 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దేశంలో బీసీ కులాలలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయన్నారు. ఎన్నో కమిషన్లు బీసీల ఆర్థిక, సామాజిక అంశాపై నివేదికలు ఇచ్చాయన్నారు. ఒక సామాజిక ఏజెండాతో ముందుకెళ్లాల్సిన అసవరం ఉందన్నారు. ఫూలే దంపతులు గొప్పసంస్కర్తలన్నారు. వారి సేవలు ఒకే వర్గానికే పరిమితం కావొద్దన్నారు. క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య బి సురేష్‌లాల్‌, బీసీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ శ్రీనివాస్‌, కేయూ అభివృద్ధి అధికారి ఆచార్య వాసుదేవరెడ్డి, అడ్జెంట్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ రామస్వామి, రిటైర్డ్‌ ఆచార్యులు కె విజయబాబు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వల్లాల పృథ్వీరాజ్‌ పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ

సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక

హన్మకొండ అర్బన్‌/ హన్మకొండ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షుడు కొమ్ముల బాబు తెలిపారు. శుక్రవారం హనుమకొండలో నిర్వహించిన సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి భిక్షపతి, యానం విజయ్‌ కుమార్‌ సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా, టీ పీఆర్‌టీయూ సభ్యులుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని సంఘం నుంచి బహిష్కరించామన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా తొంత సత్యనారాయణ (యాదాద్రి భువనగిరి జిల్లా), ప్రధాన కార్యదర్శిగా చాగంటి ప్రభాకర్‌ (మహబూబాబాద్‌ జిల్లా), కార్వనిర్వాహక అధ్యక్షుడిగా నీరటి సాయిలు (నిజామాబాద్‌ జిల్లా), రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపాక జనార్ధన్‌ (హనుమకొండ జిల్లా) అసోసియేటేడ్‌ ప్రెసిడెంట్‌గా దారా శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కచ్చిగళ్ల మల్లయ్య, పానుగంటి యాదగిరి, పాగ సునీత, భూక్యా విజయలక్ష్మి (వరంగల్‌ జిల్లా) ఎన్నికయ్యారని వివరించారు. మరో ఆరుగురిని ప్రత్యేక రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినట్లు తెలిపారు.

మాట్లాడుతున్న కొమ్ముల బాబు
1/1

మాట్లాడుతున్న కొమ్ముల బాబు

Advertisement
Advertisement